శ్రద్ధా కపూర్ బ్యూటిఫుల్ హెయిర్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

First Published | Jan 12, 2022, 5:02 PM IST

శ్రద్ధా కపూర్ జుట్టు కూడా ఎంతో అందంగా.. ఆరోగ్యంగా ఉంటుంది. తన జట్టు అంత అందంగా ఉండేందుకు.. ఆమె సీక్రెట్ హెయిర్ ప్యాక్ ని ఉపయోగిస్తారట. మరి ఆ సీక్రెట్ హెయిర్ ప్యాక్ ఏంటో మనమూ తెలుసుకుందామా..
 

బాలీవుడ్ హాట్ అండ్ క్యూట్ బ్యూటీల్లో శ్రద్ధాకపూర్ ముందుంటుంది. బాలీవుడ్ లో వరస సినిమాలతో దూసుకుపోతున్న శ్రద్ధ.. సాహో సినిమాతో.. తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  కాగా.. ఆ సినిమాలో ఆమె అందానికి అందరూ ఫిదా అపోయారు.

శ్రద్ధాకపూర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 68మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదొక్కటి చాలు.. ఆమెకున్న క్రేజ్ ఏంటో చెప్పడానికి..

Latest Videos



కాగా.. శ్రద్ధా కపూర్ జుట్టు కూడా ఎంతో అందంగా.. ఆరోగ్యంగా ఉంటుంది. తన జట్టు అంత అందంగా ఉండేందుకు.. ఆమె సీక్రెట్ హెయిర్ ప్యాక్ ని ఉపయోగిస్తారట. మరి ఆ సీక్రెట్ హెయిర్ ప్యాక్ ఏంటో మనమూ తెలుసుకుందామా..

తన జట్టు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు శ్రద్ధాకపూర్.. బయట లభించే హెయిర్ ప్యాక్స్ వినియోగించదట. సహజంగా.. ఇంట్లోని వస్తువులతో తయారు చేసే.. హెయిర్ ప్యాక్ ని ఆమె వినియోగిస్తారట. అదేంటి..? దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా.. రెండు కలబంద కొమ్మలు తీసుకోవాలి. వాటిలో నుంచి కలబంద గుజ్జును తీసుకోవాలి. దీనికి పక్కన పెట్టేసి..  చేతులు నిండేంత.. మందార పూలను తీసుకోవాలి. అంతేకాకుండా.. రెండు స్పూన్ల పెరుగు కూడా తీసుకోవాలి.

ఇప్పుడు.. వీటన్నింటినీ బాగా కలిపి.. తలకు పట్టించాలి.  20 నిమిషాలపాటు అలానే వదిలేసి.. తర్వాత ...  నార్మల్ నీటితో.. జుట్టును శుభ్రం చేసుకోవాలి. నీటితో.. పూర్తిగా జుట్టును కడిగేయాలి.

ఇలా తరచూ చేయడం వల్ల.. శ్రద్ధాకపూర్ లాంటి అందమైన జుట్టు మీ సొంతం కూడా అవుతుంది.  కలబంద జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇక.. మందారపూలు.. జుట్టు మృదువుగా మారడానికీ.. షైన్ అవ్వడానికి కూడా సహాయం చేస్తాయి. కాబట్టి.. తరచుగా.. ఈ హెయిర్ ప్యాక్ వినియోగిస్తూ ఉండటం వల్ల.. జుట్టు అందంగా మెరుస్తుంది. 
 

click me!