తెలుగు తెరపై వరస సినిమాలతో దూసుకువెళ్తున్న నటి పూజా హెగ్డే. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈ ముద్దుగుమ్మ ఆడిపాడింది.
undefined
త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో కలిసి మనల్ని అలరించడానికి రెడీగా ఉంది. అంతేకాదు.. బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన హవా కొనసాగిస్తోంది.
undefined
కాగా.. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే.. పూజా అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె స్కోన్ టోన్ ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటుంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ.. మేకప్ లేకపోయినా పూజా చాలా అందంగా ఉంటుంది.
undefined
మరి ఆమె అందం వెనక సీక్రెట్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం ఈ బుట్టబొమ్మ, ఉదయం, నైట్ కేర్ రొటీన్ ఏంటో ఓసారి చూసేద్దాం..
undefined
పూజా తన డైట్ లో కార్బొహైడ్రేట్స్ కి కూడా చోటు ఇస్తుందట. అయితే.. తన భోజనంలో కొంచెం నెయ్యిని మాత్రం తప్పకుండా తీసుకుంటుందట. దాని వల్ల తన స్కిన్ చాలా గ్లో గా కనిపిస్తుందని చెబుతోంది.
undefined
ఉదయం లేవగానే.. తన ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటుందట. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటుందట. తాను బయటకు ఎక్కడికి వెళ్లినా.. తన వెంట కచ్చితంగా మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, ఫేస్ ప్యాకులను తన బ్యాగులో పెట్టుకుంటుందట.
undefined
షూటింగ్ అయిపోయిన వెంటనే తాను ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తుందట. అలా చేయడం వల్ల తన స్కిన్ హైడ్రేట్ అవుతుందట. అంతేకాదు.. బయట నుంచి ఇంటి వచ్చిన వెంటనే ఎంత అలసటగా ఉన్నా కూడా.. మేకప్ తీసేస్తుందట.
undefined
షూటింగ్ లేకపోతే.. తాను అసలు ఎలాంటి మేకప్ వాడనని.. అలా నేచురల్ గా ఉంచాతనని.. దాని వల్ల కూడా తన ముఖం తాజాగా ఉంటుందని ఆమె చెప్పడం విశేషం.
undefined