బాలీవుడ్ లోని చాలా మంది అందగత్తెల్లో మలైకా అరోరా ఒకరు. ఆమె వయసు రోజు రోజుకీ పెరిగినట్టే.. ఆమెలోని అందం కూడా రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఆమె విషయంలో వయసు పెరగడం అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఇప్పటికీ ఆమె చాలా ఫిట్ గా అందంగా కనిపిస్తారు. అందుకు ఆమె తీసుకునే ఆహారం తోపాటు.. కొన్ని బ్యూటీ టిప్స్ కారణం.
undefined
కేవలం ముఖారవిందం మాత్రమే కాదు.. మలైకా జట్టు కూడా చాలా అందంగా ఉంటుంది. ఆమె తన జట్టు అందంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఓ సీక్రెట్ ఆయిల్ ఉపయోగిస్తారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ సీక్రెట్ ఆయిల్.. తనను హెయిర్ ఫాల్ నుంచి రక్షిస్తుందట. మరి ఆ ఆయిల్ ఏంటో మనమూ ఓసారి చూసేద్దామా..
undefined
కొబ్బరి నూనె జుట్టుకు ఉత్తమమైన నూనె అని చెబుతారు, ఎందుకంటే ఇది జుట్టు మూలాల నుంచి జట్టు చివర్ల వరకు బలంగా చేస్తుంది. హెయిర్ స్ప్లిట్స్ కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా జట్టు మృదువుగా మెరిసేలా చేయడానికి సహకరిస్తుంది.
undefined
ఆలివ్ ఆయిల్.. ఈ ఆయిల్ కూడా జట్టు పై చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో మల్టీ విటమిన్స్ ఉంటాయి. ఈ ఆయిల్ జట్టుకి సహజ కెరాటిన్ లా పనిచేస్తుంది. ఇది జట్టు తర్వగా పొడువు పెరగడానికి సహకరిస్తుంది.
undefined
ఆముదం.. ఇది జట్టు సహజంగా మాయిశ్చరైజర్ కలిగి ఉండేందుకు..చుండ్రు లాంటి సమస్యను తగ్గించడానికి సహాయం చేస్తుంది.
undefined
మెంతులు.. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి తలలోని చుండ్రుని తగ్గిస్తాయి. జుట్టు పొడిబారే సమస్యను కూడా తగ్గిస్తాయి.
undefined
కరివేపాకు.. ఈ కరివేపాకులో కోరాటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ లాస్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా జట్టు పెరగడానికి సహకరిస్తుంది. దీనిలో ఉండే అమినో యాసిడ్స్ కూడా జట్టు బలంగా మారేందుకు సహకరిస్తాయి.
undefined
ఇప్పుడు పైన చెప్పిన పదార్థాలన్నింటినీ సమపాళ్లలో కలిపి.. ఆ నూనెను తలకు పట్టించాలి. ఇలా తరచూ ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.. అందంగా కనపడుతుందని మలైకా తన అభిమానులకు సూచించారు.
undefined