బుట్టబొమ్మ పూజా.. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉందో..!

Published : Oct 05, 2021, 01:13 PM ISTUpdated : Oct 05, 2021, 02:51 PM IST

ఆమె ఓక లైలా కోసం నాగ చైతన్య సరసన నటించింది  ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 

PREV
111
బుట్టబొమ్మ పూజా.. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉందో..!
pooja hegde

పూజా హెగ్డే (Pooja Hegde) దక్షిణాదిలో విజయవంతమైన తారలలో ఒకరు. బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దాదాపు ఏ సినిమాలో చూసినా పూజానే కనపడుతోంది. వరస సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది.

211

పూజా తమిళ సూపర్ హీరో చిత్రం ముగమూడిలో నటించడానికి ముందు మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీలో సెకండ్ రన్నరప్‌గా ఎంపికైంది. తన తొలి చిత్రం తర్వాత, ఆమె ఒక లైలా కోసం,  ముకుంద  లాంటి తెలుగు చిత్రాలతోపాటు అనేక తమిళ చిత్రాలలో నటించింది. 

311

ఆమె ఓక లైలా కోసం నాగ చైతన్య సరసన నటించింది  ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. బాలీవుడ్ గురించి మాట్లాడుతూ, పూజా హృతిక్ రోషన్ సరసన అశుతోష్ గోవారికర్ యొక్క మొహెంజో దారో చిత్రంలో ప్రధాన నటిగా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీని అభిమానులు ఇష్టపడ్డారు, అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ సృష్టించలేకపోయింది.

411

 ఆ తర్వాత, ఆమె సాజిద్ నడియావాలా  హౌస్‌ఫుల్ 4 లో నటించింది. డీజే,  అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించింది. అభిమానులు పూజ , అల్లు అర్జున్ కెమిస్ట్రీని ఇష్టపడ్డారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి.
 

511


 హెగ్డే ప్రదర్శనలు జనాలకు నచ్చాయి. ప్రస్తుతం.., ప్రభాస్ సరసన పూజ కనిపించనుంది. ప్రభాస్ 20 చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు .యువి క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో అఖిల్ అక్కినేని సరసన కూడా పూజ నటించింది. ఈ సినిమా విడుుదలకు సిద్ధంగా ఉంది.

611
pooja hegde


సినిమాల సంగతి పక్కన పెడితే.. పూజా సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఆమెను ఇన్ స్టాలో ఫాలో అయితే.. ఆమె గురించి పూర్తి విషయాలు తెలుస్తూనే ఉంటాయి.
 

711
pooja hegde

తనకు సంబంధించిన అన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. కాగా.. ఇప్పటి వరకు పూజా తన సోషల్ మీడియాలో  చాలా సార్లు తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేశారు.

811
pooja hegde

ఆ ఫోటోలను చూస్తే.. బుట్టబొమ్మ చిన్నప్పుడు ఇంకా ముద్దుగా ఉందే అని ఎవరైనా అనాల్సిందే..  కావాలంటే ఆ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..
 

911
pooja hegde

ఈ ఫోటోలో పూజాని క్లియర్ గా గుర్తించొచ్చు. తన తల్లితో కలిసి దిగిన ఈ ఫోటో అభిమానులకు కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

1011
pooja hegde

సోదరుడికి రాఖీ కడుతున్న పూజా హెగ్డే.. ఈ ఫోటోని గతేడాది  పూజా సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. రాఖీ పండగ సందర్భంగా షేర్ చేశారు.

1111
pooja hegde

స్టైలిష్ లుక్ లో పూజా హెగ్డే. ఫోటోలో తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. ఆమె కళ్లజోడు పెట్టుకొని చాలా స్టైలిష్ గా కనపడుతున్నారు. ఈ ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. 

click me!

Recommended Stories