ముఖానికి మునగాకును ఇలా పెడితే.. మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు అన్నీ తగ్గిపోతాయ్..

First Published | Jan 9, 2025, 11:37 AM IST

మునగాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని తరచుగా తినేవారున్నారు. అయితే ఇది కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మునగాకు పేస్ట్ ను ముఖానికి గనుక పెడితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా? 

చర్మ సంరక్షణ సరిగ్గా ఉంటేనే మన ముఖం అందంగా ఉంటుంది. నీట్ గా కనిపిస్తుంది. లేదంటే జిడ్డుగా, నీరసంగా కనిపిస్తుంది. అలాగే చర్మ రంగు కూడా మారుతుంది. అందుకే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ప్రతిరోజూ చర్మ సంరక్షణ పాటించాలి. 
 

నిపుణుల ప్రకారం.. మునగాకులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. మన చర్మాన్ని అందంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.  ఈ ఆకుల్లో ఉండే ఎన్నో రకాల పోషకాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మన రూపాన్ని మెరుగుపర్చడానికి బాగా ఉపయోగపడతాయి. అందుకే ఈ ఆకులను ముఖానికి ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


చర్మానికి మునగాకు

మునగచెట్టును "మిరాకిల్ ట్రీ" అని కూడా అంటారు తెలుసా? దీనిని ఎన్నో ఏండ్లలుగా సాంప్రదాయ వైధ్యంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. మునగ చెట్టు ఆకుల్లో మన చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆకుల్లో ఇనుము కూడా మెండుగా ఉంటుంది. వీటన్నింటి వల్లే మునగాకు మన చర్మానికి మేలు చేస్తుందని అంటారు. 
 

యాంటీఆక్సిడెంట్లు

మునగాకుల్లో ఉండే యాంటీ  ఆక్సిడెంట్లు మన చర్మానికి చాలా అవసరం. ఎందుకంటే ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడానికి బాగా సహాయపడతాయి. ఇవి కణాల నష్టం, అకాల వృద్ధాప్య రూపాన్ని కలిగిస్తాయి.  మీ చర్మ సంరక్షణలో భాగంగా మునగాకును ఉపయోగిస్తే మీ ముఖంపై ముడతలు ఏర్పడవు. అలాగే సన్నని గీతలు ఏర్పడవు. అలాగే ముఖం నీరసంగా కనిపించదు. దీన్ని ఉపయోగిస్తే మీ చర్మం యవ్వనంగా ఉంటుంది. 


యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

మునగాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు, సోరియాసిస్, తామర వంటి చికాకు కలిగించే చర్మ సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. మునగాకు చర్మంలో మంటను తగ్గించి, ఎరుపు దనం లేకుండా చేస్తుంది. చర్మ సమస్యలు తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగిస్తే మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
 

హైడ్రేషన్, పోషణ

మునగాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటుగా హైడ్రేట్ లక్షణాలు కూడా ఉంటాయి. మునగాకు మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని పోషిస్తుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి, రక్షించడానికి సహాయపడతాయి. దీన్ని ముఖానికి వాడితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మునగాకు ఆయిల్ తేలికైనది. అలాగే దీన్ని మన చర్మం సులువుగా గ్రహిస్తుంది. ఈ నూనె అన్ని రకాల చర్మానికి గొప్ప మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. 

ప్రకాశవంతమైన చర్మం

మునగాకును క్రమం తప్పకుండా చర్మానికి రాసుకుంటే మీ రంగు, ఆకృతి మెరుగుపడుతుంది. ఇది మీ ముఖాన్ని మరింత ప్రకాశవంతంగా, మరింత టోన్డ్ గా చేస్తుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో మీ చర్మం బలంగా, బిగుతుగా ఉంటుంది. అలాగే ముడతలు, గీతలు తగ్గిపోతాయి. 

Latest Videos

click me!