మలైకా అందమైన జట్టు.. సీక్రెట్ ఆయిల్ ఇదే

First Published | Aug 25, 2020, 12:31 PM IST

ఆమె జట్టు మరింత అందంగా మెరిసిపోతూ ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే.. ఆమె జుట్టు అంత అందంగా ఉండటానికి ఓ సీక్రెట్ ఆయిల్ ఉందంట.. ఆ సీక్రెట్ ని ఆమె ఇటీవల రివీల్ చేశారు.

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ వన్నె తరగని అందంతో మెరిసిపోతుంటారు.
undefined
కాగా.. ఆమె చాలా రియాల్టీ షో లలో ఆమె పాల్గొంటూనే ఉంటారు. ఆ షోలలో ఆమె జట్టు మరింత అందంగా మెరిసిపోతూ ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే.. ఆమె జుట్టు అంత అందంగా ఉండటానికి ఓ సీక్రెట్ ఆయిల్ ఉందంట.. ఆ సీక్రెట్ ని ఆమె ఇటీవల రివీల్ చేశారు.
undefined

Latest Videos


మలైకా అరోరా.. బాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా చేయకపోవచ్చు. కానీ.. ఒకప్పుడు ఆమె తన అంద చందాలతో అందరినీ అలరించారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 11.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ చూస్తేనే చాలదా.. ఆమెకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవడానికి.
undefined
తన జట్టుని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆమె ఒక ఆయిల్ ని వినియోగిస్తారట. ఆ సీక్రెట్ ని ఆమె తాజాగా ప్రకటించారు. కొన్ని రకాల పదార్థాలను కలిపి ఆమె తన జట్టుకోసం ఆయిల్ తయారు చేసుకుంటారట. అదెలానో ఇప్పుడు చూద్దాం..
undefined
కొబ్బరినెనె.. మీ జట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా ఉండాలంటే కొబ్బరి నూనె చాలా అవసరం. అంతేకాకుండా జట్టు మృదువుగా, మెరుపు సంతరించకోవాలన్నా కూడా ఇది చాలా అవసరమని మలైకా చెబుతోంది.
undefined
ఆలివ్ ఆయిల్.. దీనిలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఇది ఈ మీ జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది. జట్టు త్వరగా పొడవు పెరగడానికి, త్వరగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
undefined
క్యాస్టర్ ఆయిల్.. ఈ నూనె మీ కుదుళ్లు ఎప్పుడు ఎండిపోకుండా ఉండేలా చూస్తుంది. అంతేకాకుండా.. చుండ్రు సమస్య దరిచేరకుండా కాపాడుతుంది.
undefined
మెంతులు.. నమ్మసక్యంగా లేకపోయినా ఇది చాలా నిజం. మెంతులు జట్టుపై బాగా పనిచేస్తాయి. జట్టు పెరుగుదలకు మెంతుల వైద్యం బాగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.
undefined
కరివేపాకు.. కరివేపాకు తినడానికి మాత్రమే కాదు.. జట్టు అందానికి కూడా వినియోగించవచ్చు. జుట్టు రాలే సమస్యకు కరివేపాకు చక్కని పరిష్కారం.
undefined
కాగా.. ఇప్పుడు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, మెంతులు, కరివేపాకు వేసి కలిపాలి. తర్వాత ఈ మిశ్రామాన్ని వేడి చేసి.. చల్లారిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు రాసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జట్టురాలే సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా.. మెరిసే అందమైన జుట్టు మీ సొంతమౌతుంది.
undefined
click me!