ఇంట్లో హెయిర్ డై ఎలా తయారు చేయాలి?
మనం ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోవడం చాలా ఉత్తమం. ఇది.. తెల్ల జుట్టు బయటకు కనిపించకుండా చేయడంతో పాటు.. పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. వీటిలో కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి.. జుట్టు పాడౌతుందనే భయం కూడా ఉండదు.
ఇంట్లోనే తయారు చేసే హెయిర్ డై కోసం.. మనం హెన్నా, కాఫీ, టీ , బీట్‌రూట్ వంటివి వాడితే చాలు. ఇవి తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా.. జుట్టుకు అన్ని పోషకాలు అందుతాయి. దీని వల్ల జుట్టు కుదుళ్లు మరింత బలంగా మారతాయి.