ఒత్తైన జుట్టు కావాలా.. బియ్యం నీటిని వీటితో కలిపి రాస్తే చాలు..!

Published : Jan 29, 2025, 11:47 AM IST

మార్కెట్లో జుట్టు పెరగడానికి ఏవేవో నూనెలు అమ్ముతున్నారు. వాటి వల్ల ఫలితం ఉంటుందో లేదో తెలీదు. అయితే.. బియ్యం నీటిని వాడితే మాత్రం కచ్చితంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. అదెలాగో తెలుసుకుందాం....  

PREV
15
ఒత్తైన జుట్టు కావాలా.. బియ్యం నీటిని వీటితో కలిపి రాస్తే చాలు..!


ఈ రోజుల్లో మహిళలు అందరూ కామన్ గా ఎదుర్కొనే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది జుట్టు రాలడం. ఆరోగ్యకరమైన పొడవాటి, ఒత్తైన జుట్టు  కావాలనే అందరూ కోరుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో మన చుట్టూ ఉండే కాలుష్యం, మన ఆహారపు అలవాట్ల కారణంగా  అది సాధ్యం కావడం లేదు. పొడవాటి , అందమైన జుట్టు పొందడం కళగానే మిగిలిపోతోంది. మార్కెట్లో జుట్టు పెరగడానికి ఏవేవో నూనెలు అమ్ముతున్నారు. వాటి వల్ల ఫలితం ఉంటుందో లేదో తెలీదు. అయితే.. బియ్యం నీటిని వాడితే మాత్రం కచ్చితంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. అదెలాగో తెలుసుకుందాం....
 

25
rice water


బియ్యాం నీటితో జుట్టు రాలడం చెక్..?

బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి.  ఈ కార్బో హైడ్రేట్స్ జుట్టు  పెరగడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఇనోసిటాల్ దెబ్బ తినే జుట్టును సరి చేయడానికి, జుట్టు ఆరోగ్యవంతంగా పెరగడానికి సహాయపడతాయి. అంతేకాదు బియ్యం నీటిలో ఉండే పీహెచ్ స్థాయి.. జుట్టు రాలడాన్ని, చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. ఈ నీటిలో విటమిన్ బి, ఈ వంటి పోషకాలు కూడా ఉంటాయి.ఇవి కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరగడానికి కారణం అవుతాయి.
 

35
rice water

బియ్యం నీటిని జుట్టుకు ఎలా వాడాలి..?
రెండు కప్పుల బియ్యం కడిగిన నీటిని తీసుకొని ఈ నీటిని తల నుండి తల చివర వరకు రుద్దండి. తర్వాత మీ వేళ్ళతో మీ తలని బాగా మసాజ్ చేయండి. 20 లేదా 30 నిమిషాల తర్వాత, మీ జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. దీనిలోని పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి. బియ్యం కడిగిన నీటిని మాత్రమే ఉపయోగించకుండా, నీటిని ఉసిరికాయ రసంతో కలిపి మసాజ్ చేయండి. కనీసం వారానికి ఒకసారి ఇలా చేయండి. దీనిలోని విటమిన్ సి లక్షణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడతాయి.

45
fenugreek rice water

నానబెట్టిన మెంతి నీరు:

మీరు బియ్యం కడిగిన నీటిలో కలిపిన ఉసిరిని ఎలా ఉపయోగించారో.. అదేవిధంగా, మీరు నానబెట్టిన మెంతి నీటిని కూడా జోడించి తలపై రాయవచ్చు. సాధారణంగా, మెంతులను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
 

55

రోజ్మేరీ నూనె:
కొంచెం రోజ్మేరీ నూనెను బియ్యం నీటితో కలిపి మీ తలపై రాయండి. దానిలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. బియ్యం నీటిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. అధికంగా వాడకుండా ఉండండి. వారానికి ఒకసారి వాడటం మంచిది.

click me!

Recommended Stories