మీ ముఖం బంగారంలా మెరిసిపోతుంది.. ఈ చిన్న పువ్వును పెడితే..

Published : Jan 29, 2025, 10:01 AM IST

మగవారి సంగతి పక్కన పెడితే ఆడవాళ్లు తమ ముఖాన్ని అందంగా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఒక చిన్న పువ్వు మీ ముఖాన్ని బంగారంలా మెరిసేలా చేయడానికి బాగా సహాయపడుతుంది. అదేం పువ్వు అంటే? 

PREV
15
 మీ ముఖం బంగారంలా మెరిసిపోతుంది.. ఈ చిన్న పువ్వును పెడితే..

ఆడవాళ్లందరు తమ ముఖాలు బంగారంలా మెరిసిపోవాలని ఆశపడతారు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, దుమ్ము, దూళి వంటి వాటివల్ల ముఖం నల్లగా మసక బారుతుంది. నిర్జీవంగా కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రై అవుతుంది. అలాగే ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, వయసుకంటే ముందే ముడతలు రావడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.

కానీ మీరు మీ చర్మ సంరక్షణపై కొంచెం ఫోకస్ పెడితే మాత్రం ఈ చర్మ సమస్యలన్నింటినీ తగ్గించుకోని మీ ముఖాన్ని బంగారంలా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

బంగారంలా మెరిసే ముఖానికి కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలి?

కుంకుమపువ్వు, బాదం మాస్క్

స్కిన్ టోన్ ను మెరుగుపరిచే ఎన్నో గుణాలు బాదం పప్పుల్లో ఉంటాయి. మీరు గనుకు బాదం పప్పులు, కుంకుమపువ్వు, పసుపు, పాలన్నింటినీ మిక్స్ చేసి ముఖానికి రాస్తే మీ ముఖానికి మ్యాజికల్ గ్లో వస్తుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. దీనికోసం మనకు.. 7-8 కుంకుమపువ్వు దారాలు,  5-6 బాదం పప్పులు, 2 టీ స్పూన్ల పాలు, చిటికెడు పసుపు అవసరమవుతాయి.
 

35

ఎలా తయారుచేయాలి? 

ముందుగా బాదం పప్పులను నీళ్లలో,  కుంకుమపువ్వును పాలలో 15 నిమిషాల పాటు నానబెట్టాలి. బాగా నానిన బాదం పప్పులను గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ ను కుంకుమ పువ్వు పాలలో వేసి కలపండి. దీనిలోనే చిటికెడు పసుపు వేసి కలపండి. అంతే ఈ పేస్ట్ ను నేరుగా ముఖానికి రాయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ మాస్క్ ను వారానికి రెండుసార్లు అప్లై  చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది. 
 

45

తులసి, కుంకుమపువ్వు మాస్క్

తులసి ఆకుల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఉన్న మచ్చలను, మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. తులసి ఆకులు, కుంకుమపువ్వు, పసుపు కలిపిన పేస్ట్ ను మీ ముఖానికి రాసుకుంటే మీ ముఖం కాంతివంతంగా అవుతుంది. ఇందుకోసం 5-6 తులసి ఆకులు, 7-8 కుంకుమపువ్వు దారాలు, చిటికెడు పసుపు అవసరమవుతాయి. 

ఎలా తయారుచేయాలి?

టీ స్పూన్ కుంకుమపువ్వును తీసుకుని నీళ్లో నానబెట్టండి. తులసిని గ్రైండ్ చేసి అందులో పసుపును, కుంకుమ పువ్వు నీళ్లను కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి బాగా రాయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేయండి. ఈ ఫేస్ మాస్క్ ను రోజూ ముఖానికి రాస్తే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి. 
 

55


శెనగపిండి, కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్

శెనగపిండిలో కొన్ని పదార్థాలను కలిపి ముఖానికి ఫేస్ మాస్క్ లా వేసుకుంటే మీ ముఖం బంగారంలానే మెరిసిపోతుంది. ఇందుకోసం కుంకుమపువ్వును శెనగపిండిలో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనికోసం 2 టీస్పూన్ల పాలు, 1 టీ స్పూన్ శెనగపిండి, 7-8 కుంకుమపువ్వు అవసరమవుతాయి. 

ఎలా తయారుచేయాలి? 

ముందుగా కుంకుమ పువ్వును పాలలో వేసి 15 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత దీనిలో శెనగపిండి వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేయండి. ఈ ఫేస్ మాస్క్ ను వారానికి 3-4 సార్లు అప్లై చేస్తే మీ ముఖానికి మంచి గ్లో వస్తుంది. 

click me!

Recommended Stories