చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ముందుగా ముఖం కడుక్కునే అలవాటు ఉంటుంది. కొంతమంది బ్రష్ చేసేటప్పుడు ముఖాన్ని కడుగుతుంటారు. అసలు ఇలా ముఖం కడగడం కరెక్టేనా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఉదయం లేవగానే ముఖం కడుక్కోవాలా? వద్దా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉదయం నిద్రలేవగానే ముఖాన్ని ఖచ్చితంగా కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు. కానీ కేవలం నీళ్లతోనే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోదు. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే క్లెన్సర్ తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. దీంతో ముఖం కడిగితే మీ ముఖం పూర్తిగా శుభ్రపడుతుంది.
క్లెన్సర్ తో ఉదయం ముఖాన్ని కడగడం వల్ల మీ ముఖం లోపలి నుంచి శుభ్రపడుతుంది. క్లెన్సర్ ను కాటన్ బాల్ ను ముంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఉదయం ముఖం కడగాలని వేడినీళ్లను మాత్రం వాడకండి. అలాకాకుండా మరీ కూల్ వాటర్ తో కూడా ముఖం కడగకూడదు.
సాధారణంగా ఉదయం ముఖాన్ని కడగడానికి గోరువెచ్చని లేదా నార్మల్ వాటర్ ను ఉపయోగించండి. దీనివల్ల చర్మానికి ఎలాంటి హాని కలగదు. ఉదయం నిద్రలేచి ముఖానికి ఫేస్ వాష్ అప్లై చేసి కొన్ని సెకన్ల పాటు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
నిజానికి ఉదయాన్నే ముఖాన్ని కడగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. నిపుణుల ప్రకారం.. ఉదయాన్నే ముఖాన్ని కడగడం వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే కళ్లకు విశ్రాంతి కలుగుతుంది.