ఈ హెయిర్ మాస్క్ తో తెల్ల జుట్టుకు చెప్పండి గుడ్ బై..!

First Published | Aug 19, 2024, 11:39 AM IST

 సహజంగా ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో మనం హెయిర్ మాస్క్ వేస్తే... చాలా తక్కువ సమయంలోనే.. మన జుట్టు హెల్దీగా మారడంతో పాటు.. తెల్లని వెంట్రుకలు నల్లగా మారతాయి. 


ఈ రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా జుట్టుకు అఅందాల్సిన పోషకాలు సరిగా అందని సమయంలో.. ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే.. తెల్ల జుట్టు రాగానే కెమికల్స్ ఉన్న.. హెయిర్ కలర్స్ వాడకుండా.. సహజంగా ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో మనం హెయిర్ మాస్క్ వేస్తే... చాలా తక్కువ సమయంలోనే.. మన జుట్టు హెల్దీగా మారడంతో పాటు.. తెల్లని వెంట్రుకలు నల్లగా మారతాయి. మరి ఆ హెయిర్ మాస్క్ లు ఏంటో తెలుసుకుందాం...
 

Image: Freepik

1.కలోంజీ సీడ్స్..
కలోంజి సీడ్స్ మీకు తెలిసే ఉంటుంది. వీటినే నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు.  ఇవి మన జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి సహాయపడతాయి. ఈ గిజంల్లో లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ కు పోషణను అందించి జుట్టును బలపరుస్తుంది. అంతేకాదు.. ఈ గింజలు మన స్కాల్ఫ్ లో సెబమ్ ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.  ఈ గింజలతో తయారు చేసిన నూనెను తలకు పట్టిండచం వల్ల.. జుట్టుకు నలుపురంగును ఇచ్చే మెలనిన్ ను నష్టపోకుండా.. అది మరింత పెరగడానికి సహాయపడుతుంది. ఫలితంగా జుట్టు నల్లగా మారుతుంది.

Latest Videos



కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె దెబ్బతిన్న జుట్టును తేమ చేస్తుంది. ఇది జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టుకు పోషణనిస్తుంది.

కరివేపాకులో ఐరన్ , విటమిన్ సి ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది.మెంతి గింజల్లో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. మెంతి గింజలలో ప్రోటీన్, యాంటీ ఫంగల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది జుట్టు దురద, చుండ్రును కూడా తొలగిస్తుంది.
కరివేపాకులో విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్లు ఇలా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది.

ఇప్పుడు పైన చెప్పిన వాటితో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

మెటీరియల్
కొబ్బరి నూనె - 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - 8-10
మెంతి గింజలు - 2 టీస్పూన్లు
కలోంజి గింజలు - 2 టీస్పూన్లు
పద్ధతి
మెంతి గింజలు, కలోంజీ గింజలను పొడి చేసుకోవాలి. కరివేపాకు కూడా పొడి చేసి.. ఈ మూడింటి పొడిని కొబ్బరి నూనెలో కలిపి.. తలకు పట్టించాలి. అరగంట పాటు అలానే వదిలేసి తర్వాత.. సల్ఫేట్ లేని షాంపూ తో తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి రెండు సార్లు చేసినా.. మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
 

click me!