vaginal health
ప్రస్తుతం చాలా మంది నార్మల్ డెలివరీకె ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ సిజేరియన్ డెలివరీలే ఎక్కువగా అవుతున్నాయి. నిజానికి యోని ద్వారా బిడ్డను కనడం పురాతన, సహజ మార్గం. ఈ నార్మల్ డెలివరీ వల్ల ఆడవారికి పెద్దగా ఇబ్బందులు రావు. అయితే నార్మల్ డెలివరీ లో కూడా యోనిలో కుట్లు పడతాయి. అయినప్పటికీ యోని డెలివరీ లేదా సిజేరియన్ రెండింటిలోనూ యోనికి అదనపు సంరక్షణ అవసరం. నార్మల్ డెలివరీ తర్వాత మీ యోనిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతున్న జీవనశైలి కారణంగా మహిళల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ కారణంగా యోని డెలివరీ సంఖ్య బాగా తగ్గుతోందని నిపుణులు అంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే యోని డెలివరీ చాలా సులభం అవుతుంది. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యల కారణంగా చాలాసార్లు సిజేరియన్ అంటే ఆపరేషన్ పద్ధతిని వాడాల్సి వస్తోంది.
అత్యంత సున్నితమైన అవయవం యోని
ఆడవారి శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాలలో యోని ఒకటి. డెలివరీ తర్వాత ఇది మరింత సున్నితంగా మారుతుంది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాబట్టి యోని డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సిజేరియన్ డెలివరీ అయిన మహిళలు కూడా ఈ చిట్కాలను పాటించొచ్చు.
కూర్చునే భంగిమ
నార్మల్ డెలివరీలో యోనిలోని కొంత భాగాన్ని కట్ చేస్తారు. మూత్రం, మలద్వారం దెబ్బతినకుండా డెలివరీ సులువుగా జరిగేలా చేస్తారు. అయితే ఈ భాగానికి కుట్లు వేస్తారు. అయితే ఈ కుట్లు సాధారణంగా కరిగిపోతాయి. ఇవి కరిగిపోవడానికి 10 రోజుల నుంచి 2 వారాలు పడుతుంది. అయితే డాక్టర్ దగ్గరకు కూడా తరచుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ కుట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుట్లు పడ్డవారు కూర్చునే భంగిమపై దృష్టి పెట్టాలని నిపుణులు సలహానిస్తున్నారు. అలాగే కూర్చోవడానికి సౌకర్యవంతమైన పరుపును ఉపయోగించండి. తప్పుడు భంగిమలో కూర్చోవడం మీ కుట్లుపై ఒత్తిడి పడుతుంది. దీంతో అవి తెగిపోవచ్చు. పరిశుభ్రత కూడా ముఖ్యం.
గోరువెచ్చని నీటితో కడగండి
రోజుకు కనీసం రెండుసార్లైనా గోరువెచ్చని నీటితో కుట్లను కడగాలని నిపుణులు చెబుతున్నారు. వేడినీళ్లు కుట్లు నయం కావడానికి సహాయపడతాయి. అలాగే వాటి సంక్రమణ ప్రమాదం కూడా తప్పుతుంది. వేడినీటితో కడిగిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్ క్రీమ్ ను కుట్లపై పెట్టండి.
vaginal health
మూత్ర విసర్జన తర్వాత శుభ్రం
మూత్ర విసర్జన తర్వాత మీ యోనిని ఖచ్చితంగా శుభ్రం చేయాలి. లేదంటే యోనిలో బ్యాక్టీరియా పెరగడం స్టార్ట్ అవుతుంది. దీని వల్ల సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల ప్రకారం.. మీరు బాత్రూమ్ కు వెళ్లిన ప్రతిసారీ మీ యోనిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అలాగే మృదువైన టవల్ తో తుడవండి. ఆరనివ్వండి. అయితే టవల్ ను యోనిపై రుద్దకూడదు. లేకపోతే సమస్య పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన ద్రవాలు
అయితే డెలివరీ తర్వాత నీళ్లను ఎక్కువగా తాగకూడదని ఇంట్లో వాళ్లు చెప్తుంటారు. కానీ ఈ సమయంలో కూడా నీళ్లను పుష్కలంగా తాగాలి. లేదంటే మీ కుట్లు సరిగ్గా మానవు. మీరు త్వరగా కోలుకోవాలంటే పుష్కలంగా నీటిని తాగాలి. ప్రోబయోటిక్ పానీయాలను తాగాలి. అలాగే ఆరోగ్యకరమైన ఇతర ద్రవాలను కూడా తాగండి. డెలివరీ తర్వాత యుటిఐ ప్రమాదం ఉంది. దీనిని నివారించాలంటే ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి.
vaginal infection
ఆరోగ్యకరమైన ఆహారం
డెలివరీ తర్వాత ఆడవారు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. ఇది మీ యోని ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యానికి, పాలివ్వడానికి కూడా అంతే ముఖ్యం. ఈ సమయంలో స్పైసీ ఫుడ్స్ ను అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల మీ కడుపు అసమతుల్యం అవుతుంది. ఇది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇది కుట్లకు కూడా మంచిది కాదు. మూత్ర విసర్జన, ప్రేగు కదలికల సమయంలో మంట వస్తుంది. ఇది మీ కుట్లను చికాకుపెడుతుంది. సంక్రమణ ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ సమయంలో స్పైసీ ఫుడ్ కు బదులుగా ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తినండి. కొన్ని నెలలు వీలైనంత సాదా ఆహారాన్ని తినండి. మసాలా దినుసులకు పూర్తిగా దూరంగా ఉండండి.
డెలివరీ తర్వాత మీకు రక్తస్రావం ఎక్కువగా ఉంటే లేదా మీ యోని ఉత్సర్గ చెడు వాసన వస్తుంటే.. వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మీ యోని ఆరోగ్యం దెబ్బతింటుంది.