40 ఏండ్లు దాటిన ఆడవారికి వచ్చే రోగాలు ఇవే..

First Published May 14, 2023, 3:51 PM IST

ఇంటిళ్లి పాది ఆరోగ్యం గురించి పట్టించుకునే ఆడవారు తమ ఆరోగ్యం గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు. దీనివల్లే వీరు ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడుతుంటారు. 
 

ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట వయస్సుకు వచ్చిన తర్వాత రోగాల బారిన పడుతుంటారు. ఇది సర్వ సాధారణం. అందులోనూ నలభై ఏండ్లు దాటిన తర్వాత లేని పోని రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే 40 ఏండ్లు దాటిన తర్వాత మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.  ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. అయితే ఇది ప్రతి వ్యక్తి భిన్నంగా ఉన్నప్పటికీ.. 40 ఏండ్లకు చేరుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎన్నో కారణాల వల్ల 40 ఏండ్ల తర్వాత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి అలవాట్లు, వృద్ధాప్యంతో పాటు అనేక ఇతర కారకాలు ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతాయి. 40వ లో స్త్రీ రుతువిరతికి లోనవుతుంది. హార్మోన్ల మార్పు వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. 40 ఏండ్లు దాటిన ఆడవారికి ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉందంటే.. 
 

విటమిన్ లోపాలు

40 ఏండ్లు దాటిని ఆడవారికి ఎక్కువగా వచ్చే అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యల్లో విటమిన్ డి లోపం ఒకటి. విటమిన్ డి లోపం వల్ల ఎముక కాల్షియం, ఎముక ద్రవ్యరాశిని కోల్పోతుంది. దీంతో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం .. 40 ఏండ్లు పైబడిన మహిళల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఇది రుతువిరతి తర్వాత ఎముక నష్టం, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. 40 ఏండ్లు పైబడిన మహిళల్లో విటమిన్ బి, ఐరన్, రిబోఫ్లేవిన్ లోపం కూడా ఉంటాయి. 
 

డయాబెటిస్

ఈ వయస్సులో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. కానీ కొన్నేండ్లుగా వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటీస్ బారిన పడుతున్నారని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. 40 ఏండ్లు పైబడిన ఆడవారికి డయాబెటిస్ రావడానికి ఎన్నో కారకాలు దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇది జన్యుపరమైన కారకాల వల్ల లేదా వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా రావొచ్చు.  ఆరోగ్యకరమైన ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సకాలంలో టెస్టులు చేయించుకోవడం  ప్రీ-డయాబెస్ ను తిప్పికొట్టడానికి లేదా డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

రుతువిరతి

రుతువిరతి అనేది స్త్రీల రుతుచక్రం ముగింపును సూచించే సమయం. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. రుతువిరతికి గురైన మహిళ సగటు వయస్సు 45-55 సంవత్సరాలు.  నిపుణుల ప్రకారం.. చాలా మంది మహిళలు 30 ల చివరలో లేదా 40 ల ప్రారంభంలో పెరిమెనోపాజ్ దశకు చేరుకుంటారు. అందుకే వీరు దీని లక్షణాలను తెలుసుకోవాలి. పెరిమెనోపాజ్ శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. గుండె జబ్బులు, డయాబెటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
 

బోలు ఎముకల వ్యాధి

బోలు ఎముకల వ్యాధి అంటే మీ ఎముకలు బలహీనపడే పరిస్థితి. దీనివల్ల ఎముక నష్టం కలుగుతుంది. రుతువిరతి కారణంగా 40 ఏండ్లు ఉన్న మహిళలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. బోలు ఎముకల వ్యాధి కుటుంబ చరిత్ర ఉన్న మహిళలు వారి ఎముక ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రుతువిరతి సమయంలో ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. మెనోపాజ్ సమయంలో తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తగినంత విటమిన్ డి ని తీసుకోవాలి. సరైన వ్యాయామాలు చేయాలి. సరైన ఆహారాన్ని తీసుకోవాలి. 
 

Image: Getty

గుండె జబ్బులు

మహిళల్లో ఎక్కువ మంది మరణానికి గుండె జబ్బులు ప్రధాన కారణమని, ఈ వయస్సులో అనారోగ్యం బారిన పడటం కూడా ఒక కారణమని మీకు తెలుసా? ఇది ప్రాణాల మీదికి రాకుండా ఉండాలంటే మహిళలు గుండె జబ్బుల లక్షణాలను తెలుసుకోవాలి. పేలవమైన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. అలాగే రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
 

breast cancer

రొమ్ము క్యాన్సర్

నిపుణుల ప్రకారం.. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఆహారం, పర్యావరణం వంటి ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అందుకే క్రమం తప్పకుండా రొమ్ము స్వీయ పరీక్ష లేదా హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోవాలి. 
 

click me!