బొద్దింకలు ఇంట్లో ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నాయా? ఇలా చేశారంటే ఒక్క బొద్దింక కూడా ఉండదు

First Published | Sep 3, 2024, 10:03 AM IST

వర్షాకాలంలో ఈగలు, దోమలతో పాటుగా బొద్దింకల  బెడద కూడా విపరీతంగా ఉంటుంది. తేమ వల్ల ఇవి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. చూడటానికి చిన్న కీటకాలే అయినా వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని ఇంట్లో నుంచి తరిమికొట్టే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

బొద్దింకలు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఈ చిన్న కీటకాలు మురికిని వ్యాప్తి చేయడమే కాకుండా ఎన్నో వ్యాధుల వాహకాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అవును వర్షం వల్ల ఇంట్లో ఎక్కడా చూసినా తేమ ఉంటుంది.

నిజం చెప్పాలంటే వర్షాకాలం మనకు ఎన్నో సమస్యలొచ్చేలా చేస్తుంది. తేమ కారణంగా గోడల మధ్య కొన్నిసార్లు పగుళ్లు కనిపిస్తుంటాయి. ఈ పగుళ్ల నుంచి రకరకాల కీటకాలు, ముఖ్యంగా బొద్దింకలు, చీమలు రావడం ప్రారంభిస్తాయి.

కానీ ఇంట్లో బొద్దింకలు తిరగడం ఆరోగ్యానికి  అస్సలు మంచిది కాదు. అయితే కొన్నిసింపుల్ చిట్కాలతో మీ ఇంట్లోకి ఒక్క బొద్దింక కూడా రాకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

తేమ వల్ల బొద్దింకలు ఎక్కువగా గోడల పగుళ్ల నుంచి బయటకు వస్తుంటాయి. అందుకే ఇలాంటి పరిస్థితిలో ఈ కీటకాలను తొలగించడానికి ముందుగా మీరు చేయాల్సిన మొదటి పని పగుళ్లను సరిచేయడం. దీని కోసం మంచి సిలికాన్ సీలెంట్ లేదా ప్లాస్టర్ ను ఉపయోగించి పగుళ్లను  మూసేయండి. 

అలాగే గోడలు పగుళ్లు రాకుండా ఉండాలంటే మీరు గోడలోకి తేమ రాకుండా చూసుకోవాలి. దీని కోసం తేమ ఎక్కడి నుంచైతే వస్తుందో దాన్ని గమనించండి. పైప్ లైన్ లో లీకేజీ వల్ల లేదా నీళ్లు నిలిచిపోవడం వంటి వివిధ కారణాల వల్ల గోడకు తేమ వస్తుంది.

అందుకే తేమ రాకుండా ఉండటానికి పేరుకుపోయిన నీళ్లను శుభ్రం చేయడం, వాటర్ పైప్ లైన్ ను రిపేర్ చేయడం వంటివి చేయండి. అలాగే గదిలో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. గాలి ప్రవాహాన్ని పెంచడానికి ఎయిర్ కండిషనర్, ఫ్యాన్ లేదా విండో ఎగ్జాస్ట్ ను ఉపయోగించండి. దీంతో తేమ కూడా త్వరగా ఎండిపోతుంది. 
 


బొద్దింకలు రాకుండా ఏం చేయాలి? 

రూపాయి ఖర్చు లేకుండా మీరు చాలా సులువుగా ఇంట్లోకి బొద్దింకలు రాకుండా చేయొచ్చు. ఉన్నవాటిని పారిపోయేలా చేయొచ్చు. ఇందుకోసం మీ వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించండి. బొద్దింకలను చంపడానికి క్రిమిసంహారక స్ప్రేలు లేదా బోరిక్ ఆమ్లాన్ని ఉపయోగించండి. గోడ పగుళ్లపై బోరిక్ యాసిడ్ ను చల్లండి. లేదా వేప నూనె లేదా వెల్లుల్లి పేస్ట్ ను ఉపయోగించొచ్చు.  ఇవి కూడా బొద్దింకలు ఇంట్లోకి రాకుండా చేస్తాయి. 
 

ఇలా చేస్తే ఇంట్లోకి బొద్దింకలు రావు

మీకు తెలుసా? ఎవరి ఇంట్లో అయితే తేమ , మురికి ఎక్కువగా ఉంటాయో.. వారింట్లోకే బొద్దింకలు ఎక్కువగా వస్తాయి. ఈ కీటకాలు మీ ఇంట్లోకి రాకూడదంటే మాత్రం ఇంట్లో ఎక్కడా చెత్త లేకుండా చూసుకోవాలి. అలాగే ఆహారాన్ని పరిశుభ్రమైన ప్రదేశంలో నిండుగా కప్పి ఉంచాలి. గోడలను, నేలను క్రమం తప్పకుండా శుభ్రంగా చేసుకోవాలి. ఇవి బొద్దింకలు రాకుండా చేయడానికి సహాయపడతాయి. 
 

cockroaches


ఈ చిట్కాలతో కూడా బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమికొట్టొచ్చు

బేకింగ్ సోడా, చక్కెరతో మీరు చాలా ఈజీగా ఒంట్లో బొద్దింకలు పారిపోయేలా చేయొచ్చు. ఈ రెండూ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. కాబట్టి వీటిని ఎలా ఉపయోగించాలంటే?

మీకు తెలుసా? బొద్దింకలు తీపి పదార్థాలను బాగా తింటాయి. అయితే చక్కెరలో  బేకింగ్ సోడాను మిక్స్ చేసి బొద్దింకలు బాగా తిరిగే చోట వేయండి. వీటిని బొద్దింకలు తింటే.. బేకింగ్ సోడా ఈ కీటకాల కడుపులో వాయువును సృష్టిస్తుంది. ఇది బొద్దింకలు చనిపోయేలా చేస్తుంది. 

దీన్ని ఎలా తయారుచేయాలంటే.. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా, చక్కెరను సమాన మొత్తంలో తీసుకుని కలపండి. దీన్ని బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని చల్లండి. వంటింటి సింక్ కింద, అల్మారాల మూలల్లో లేదా ఫ్లోర్ పగుళ్లు వంటి ప్రదేశాల్లో చల్లండి. 

Latest Videos

click me!