వయసు పెరగడం, వంశపారంపర్యం, ఆండ్రోజెన్ హార్మోన్ మార్పులే బట్టతలకి ప్రధాన కారణాలని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య బారిన పడకూడదంటే చిన్న వయసు నుంచే జుట్టును సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారం తినడం, వారానికి ఒకసారి తలస్నానం చేయడం, నెత్తిని శుభ్రం చేయడం చేస్తే బట్టతల బారిన పడే ప్రమాదం ఉండదు. మరి బట్టతల రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.