
దేశంలోని అత్యంత సంపన్నులు ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక ఆమె వయసు పెరుగుతున్నా, ఆమె ముఖంలో ఏదో తెలియని గ్లో కనపడుతూ ఉంటుంది. ఆమెలా మీరు మెరవాలనుకుంటే.. ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఓసారి చూద్దామా..
1.నీతా అంబానీ తన చర్మాన్ని హైడ్రెటుడ్ గా ఉంచుకుంటూ ఉంటారట. మీరు కూడా నీతా లా మెరవాలంటే ఆమెలాగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దానికోసం ప్రతిరోజూ మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. చర్మం సహజంగా మెరవడానికి సహాయపడుతుంది.
2.బ్యాలెన్సడ్ డైట్.. విటమిన్లు, మినర్సల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేలా ఆరోగ్యకరమైన, బ్యాలెన్స్డ్ డైట్ ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చర్మం లోపల నుంచి బయట నుంచి ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి సహాయపడుతుంది. అందుకోసం తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, లీన్ ప్రోటీన్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
3.సరైన నిద్ర..ఆరోగ్యంగా, అందంగా కనిపించేందుకు సరైన నిద్ర చాలా అవసరం. అందుకోసం ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ఇలా నిద్రపోవడం వల్ల రాత్రి పూట చర్మం రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.
4.ఒత్తిడి ఉండకూడు.. ఎక్కువ ఒత్తిడి ఉంటే అవి చర్మంపై ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దాని కోసం యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయాలి.
5.జెంటిల్ క్లెన్సర్.. చర్మానికి హార్ష్ గా ఉండే సబ్బులు వాడకూడదు. హార్ష్ గా ఉండే సబ్బులు వాడటం వల్ల చర్మం తొందరగా పాడౌతుంది. అందుకే చర్మానికి హాని కలిగించేవి కాకుండా, సున్నితంగా ఉండే సబ్బులను వాడాలి.
6.టోనర్..చర్మం పీహెచ్ లెవల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి రెగ్యూలర్ గా టోనర్ వాడుతూ ఉండాలి. దీని వల్ల కూడా చర్మం అందంగా కనపడుతుంది.
7.సీరమ్.. ఫేస్ సీరమ్ ని కూడా రెగ్యులర్ గా వాడాలి. దీనిలో విటమిన్ సీ, విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడతాయి.
8.మాయిశ్చరైజర్.. రెగ్యులర్ గా చర్మానికి మాయిశ్చరైజర్ వాడుతూ ఉండాలి. దీని వల్ల చర్మం డ్రై గా కనిపించకుండా, తేమగా ఉండేలా ఉండటానికి సహాయపడుతుంది. చర్మం అందంగా కనపడటానికి సహాయపడుతుంది.
9.ఇక ప్రతిరోజూ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాస్తూ ఉండాలి. కనీసం ఎస్పీఎఫ్ 30 ఉండేలా ఉండే సన్ స్క్రీన్ లోషన్ ని ఎంచుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే, మీరు కూడా నీతా అంబానీలా అందంగా మెరిసిపోతారు.