ఒక్క రోజులో పెదాలను ఎర్రగా మార్చుకోవడం ఎలా..?

First Published Dec 22, 2023, 12:36 PM IST

ఇలాంటి సమయంలో అమ్మాయిలకు పాపం.. లిప్ స్టిక రాసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి ఈ కింది సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే, ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..


చలికాలం వచ్చింది అంటే చాలు.. మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేనా ముఖ్యంగా అందరికీ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. పెదాలు ముఖ్యంగా బాగా పగిలిపోతూ ఉంటాయి. ఎంత లిప్ బామ్ లాంటివి రాసినా పెద్దగా ఫలితం ఉండదు. ఊరుకూరికే డ్రై అయిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో అమ్మాయిలకు పాపం.. లిప్ స్టిక రాసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి ఈ కింది సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే, ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
 

చలికాలంలో పెదాలు పగలడం, పొడిబారటం లాంటివి జరుగుతాయి. దాంతో.. పెదాలపై ఓ డెడ్ లేయర్ తయారౌతుంది. దానిని తొలగిస్తే, మనకు అందమైన గులాబీ రంగు పెదాలు లభిస్తాయి. దాని కోసం మనం మన ఇంట్లో లభించే పంచదారతో పెదాలపై స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ పోయి.. పెదాలు లేత గులాబి రంగులో మెరిసిపోతాయి.

Latest Videos


కొందరికి, పెదాలు పిగ్మెంటేషన్ కి గురౌతాయి. దాని వల్ల పెదాలు నల్లగా మారతాయి. అలా నలుపు తొలగిపోయి.. ఎర్రగా మెరిసిపోవాలంటే మనం ఒక హోమ్ మేడ్ రెమిడీని ఫాలో అవ్వొచ్చు. అదేంటంటే... పొటాటో జ్యూస్ లో పాలు, పసుపు కలిపి ఆ పేస్ట్ ని పెదాలపై అప్లై చేయాలి ఇలా ఆ పేస్ట్ ని తరచూ పెదాలపై రుద్దడం వల్ల మనం లేత, అందమైన గులాబి రంగు పెదాలను పొందవచ్చు.

chapped lips

పెదాలు ఊరుకూరికే పొడిబారకుండా ఉండాలి అంటే, పెదాలపై కొన్ని పదార్థాలను అప్లై చేయాలి. అది కూడా బయట మార్కెట్లో కొనే వస్తువులు కాకుండా, ఇంట్లో లభించే షియా బటర్, కొబ్బరి నూనె, బాదం నూనె అప్లై చేయడం వల్ల మనం పెదాలను అందంగా మలుచుకోవచ్చు.
 

ఎక్కువగా నూనె, ఉప్పు ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. దానికి బదులు మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు భాగం చేసుకోవాలి. ఈ ఫుడ్స్ మీకు అందాన్ని పెంచడంలోనూ సహాయం చేస్తాయి. పెదాలు మృదువుగా మారడానికి సహాయపడతాయి.
 

Hydration is Key

ఇక, మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం దాహం వేయకపోయినా వాటర్ తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అప్పుడు పెదాలు కూడా అందంగా కన పడతాయి.


ఇక, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్, లిప్ గ్లాస్ లాంటివి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. వాటిని ఎక్కువగా వాడినా పెదాలు పాడయ్యే ప్రమాదం ఉంది.

click me!