సుధామూర్తి తన కొడుక్కి డబ్బు విలువ ఎలా నేర్పించారో తెలుసా?

First Published | May 25, 2023, 1:47 PM IST

సుధామూర్తి తన ఫాలోవర్స్ కి చాలా సార్లు పేరెంటింగ్ టిప్స్ చెబుతూ ఉంటారు. అందులో తన కొడుకు రోహన్ మూర్తికి డబ్బు విలువ ఎలా తెలియజేసారో తెలుసుకుందాం..

సుధామూర్తి.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్యగా మాత్రమే కాదు, ఆమె రచనలు, పుస్తకాలు, ఆమె చేసే సేవా కార్యక్రమాలతో అందరికీ సుపరిచితమే.  ఒక విలువలుగల మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని ఆమె జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఆమె చెప్పే జీవిత పాఠాలు ఎందరికో ఉపయోగపడతాయి.

sudha murthy

తాజాగా ఆమె తన కొడుక్కొ చిన్నతనంలో డబ్బుకు సంబంధించిన విలువను ఎలా నేర్పించాను అనే విషయాన్ని పంచుకున్నారు. నిజానికి ఈ విషయం ఇప్పటి తరం తల్లిదండ్రులకు కచ్చితంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ముందు ఆమె ఏం చెప్పారో చూద్దాం..

Latest Videos


సుధామూర్తి తన ఫాలోవర్స్ కి చాలా సార్లు పేరెంటింగ్ టిప్స్ చెబుతూ ఉంటారు. అందులో తన కొడుకు రోహన్ మూర్తికి డబ్బు విలువ ఎలా తెలియజేసారో తెలుసుకుందాం..
 

Life lessons to take from Sudha Murthy

రోహన్ మూర్తి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తన బర్త్ డే పార్టీని 5స్టార్ హోటల్ లో జరుపుకోవాలని ఆశపడ్డాడట. ఇదే విషయాన్ని సుధామూర్తిని అడిగాడట. స్నేహితలకు హోటల్ లో పార్టీ ఇస్తానని కోరాడట. అతను అడిగినదానికి అవుననో, కాదనో సమాధానం చెప్పకుండా, డబ్బు విలువను ప్రాక్టికల్ గా ఆమె తెలియజేశారట.
 

వెంటనే ఆ పార్టీకి ఎంత ఖర్చుు అవుతుందో, ముందు ఒక లెక్క వేద్దామని ఆమె అన్నారట. నువ్వు 50 మంది పిల్లలను పార్టీకి పిలిచావ్ అనుకుందాం. ఒక్కక్కరికి రూ. వెయ్యి ఖర్చు అవుతుంది అనుకుంటే, పార్టీ కి మొత్తం రూ.50వేలు ఖర్చు అవుతుంది అని ఆమె లెక్క వేశారట.

ఇదే డబ్బుని 5 స్టార్ హోటల్ లో ఖర్చు పెట్టే బదులు, మన కోసం పనిచేసే డ్రైవర్ల పిల్లల చదువులకు ఉపయోగించవచ్చు అని ఆమె చెప్పారట. అంతేకాదు లగ్జరీ హోటల్ లో పార్టీ కంటే, ఇంట్లో స్నేహితులు అందరికీ సమోసా, జ్యూస్ ఇచ్చి పార్టీ చేసుకోవచ్చని సలహా కూడా ఇచ్చారట.

పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది. అలాంటి బర్త్ డే అంత ఎక్కువ, కేవలం పార్టీకి ఖర్చు పెట్టడం నాకు నచ్చలేదు అని ఆమె చెప్పడం విశేషం. ఆమె తన కుమారితో ఒక్క మాటే చెప్పారట. నువ్వు కూడా చాలా ఆర్డనరీ బాయ్ అని అన్నారట. మీ నాన్నగారికి, నాకు డబ్బులు ఉన్నాయని నువ్వు ఎక్స్ ట్రాఆర్డనరీ అయిపోవని, కేవలం ఆర్డినరీ కుర్రాడివే అంటూ చెప్పడం విశేషం. ఆరోజు వాళ్ల అమ్మ చెప్పిన పాఠం రోహన్ కి బాగా అర్థమై, ఇప్పటికీ అదే సూత్రాన్ని ఫాలో అవుతూ వస్తున్నాడట.

click me!