సమ్మర్ వచ్చింది అంటే చాలు ముఖం కాంతి హీనంగా మారుతుంది. వేల రూపాయలు ఖర్చు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. అలాంటివారు ఈ సాధారణ ఇంట్లో లభించే ఓ ఫేస్ ప్యాక్ ని వాడితే మీ ముఖం వెలిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫేస్ ప్యాక్ ఏంటో ఓసారి చూసేద్దామా....
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పసుపు, కొద్దిగా నిమ్మరసం.. కేవలం ఈ పదార్థాలతో మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.
దీనికి మీరు చేయాల్సిందల్లా.. ముందుగా ఓ గిన్నె తీసుకొని వీటన్నింటినీ దానిలో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి.కళ్లు తప్పించి, మిగిలిన ప్రాంతాల్లో దీనిని రాయాలి.
దాదాపు 15 నిమిషాల పాటు దానిని అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుబ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది.
తేనె.. దీనిలో మాయిశ్చరైజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మార్చడానికి సహాయపడతాయి.
yogurt
పెరుగు.. దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. స్కిన్ టైట్ గా మారడానికి సహాయపడుతుంది.
മഞ്ഞള്
పసుపు.. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై రెడ్ నెస్ తగ్గించడానికి, చర్మానికి గ్లో తీసుకురావడానికి సహాయపడుతుంది.
నిమ్మరసం.. దీనిలో సహజమైన ఆమ్లాలు ఉంటాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు, డార్క్ స్పాట్స్ ని కూడా తొలగిస్తుంది.