జుట్టు రాలడం, చుండ్రు, స్ప్లిట్ , పొడిబారిన జుట్టు, బట్టతల వంటి సమస్యలను మనం తరచుగా ఎదుర్కొంటూనే ఉన్నాం. ఈ సమస్యల నుంచి బయటపడటానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే.. చాలా మందికి పరిష్కారం దొరకదు. దీంతో.. ప్రయత్నాలు చేయడం ఆపేస్తారు. అయితే.. నిజానికి ఈ సమస్యలన్నింటినీ.. కేవలం ఆయుర్వేదంతో పరిష్కరించవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
మీరు మీ జుట్టును దృఢంగా, దీర్ఘకాలం పాటు ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. హెల్తీ ఫుడ్స్ హెయిర్ ఫోలికల్స్ ను లోపల నుండి పోషణనిచ్చి వాటిని మరింత స్థితిస్థాపకంగా మారుస్తాయి.
ముఖ్యంగా పండ్లు , కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వును చేర్చడం - నెయ్యి లేదా గింజలు వంటివి కచ్చితంగా తీసుకోవాలి.
జీర్ణక్రియలో సహాయపడే ఆహారాలతో - ఉదా. జీలకర్ర, పసుపు, అల్లం తేనె వంటివి తీసుకోవాలి.
ఇవి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
జుట్టుకు నూనె రాయడం, తల స్నానం చేయడం..
హెయిర్ ఆయిల్స్ ఫోలికల్స్ , స్కాల్ప్‌కు పోషణనిస్తాయి. అంతేకాకుండా.. జుట్టులో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఎల్లప్పుడూ తల స్నానం చేయడానికి ముందు.. జుట్టుకు కచ్చితంగా నూనె రాసుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది.
మీరు కొబ్బరి లేదా నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు లేదా ఉసిరి, గులాబీ రేకులు, రీతా మొదలైన అనేక ఆయుర్వేద మూలికల మిశ్రమాన్ని కలిగి ఉన్న హెర్బల్ హెయిర్ ఆయిల్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఇక వారానికి రెండు సార్లు.. కచ్చితంగా తలస్నానం చేయాలి. నూనె రాసుకున్న తర్వాత.. తల స్నానం చేయడం వల్ల .. జుట్టుకున్న నూనెలు తొలగిపోతాయి. ఇక.. చేయమన్నారు కదా.. అని వారంలో రెండుసార్లు కంటే ఎక్కువగా తల స్నానం చేయకూడదు. ఎక్కువగా జుట్టును కడగడం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనెలు తొలగించబడతాయి.సరైన జుట్టు పెరుగుదలను నిరుత్సాహపరుస్తుంది.
స్కాల్ప్ మసాజ్
మీ స్కాల్ప్‌ను కడిగే ముందు గోరువెచ్చని హెయిర్ ఆయిల్‌తో ఎల్లప్పుడూ మసాజ్ చేయాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తోంది. హెర్బల్ ఆయిల్‌తో స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మూలాల నుండి కొన వరకు జుట్టును బలోపేతం చేస్తుంది.
హెర్బల్ హెయిర్ కేర్
రీతా (సపిండస్ ముకోరోస్సీ) , షికాకై (సెనెగాలియా రుగటా) జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి , జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఆయుర్వేదంలో అత్యంత ప్రసిద్ధ మూలికలు. ఈ మొక్కల నుండి వచ్చే పండ్లను వెచ్చని నీటిలో కలిపినప్పుడు, అవి నురుగు, సబ్బు, షాంపూ లాంటి ఉత్పత్తిగా మారుతాయి. వీటితో.. ఆయుర్వేద షాంపూ తయారు చేసుకోవచ్చు..
ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల.. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగుతుంది. చుండ్రు, జుట్టురాలే సమస్యను తగ్గిస్తుంది.