చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? ఇదిగో పరిష్కారం...!

First Published | Apr 6, 2023, 3:15 PM IST

ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే మనం ఈ చుండ్రు సమస్య, దురద లాంటివి తగ్గించవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఓసారి చూద్దాం...

చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తుంది. చాలా రకాల షాంపూలు ఉపయోగించినా కూడా... శాశ్వత పరిష్కారం లభించదు. చుండ్రు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రావడం మొదలౌతుంది. అయితే... ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే మనం ఈ చుండ్రు సమస్య, దురద లాంటివి తగ్గించవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ట్రిక్స్ ఏంటో ఓసారి చూద్దాం...

1. ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV), నీరు
చుండ్రును తగ్గించడానికి ACV ఉత్తమంగా పనిచేస్తుంది. ACV, నీటిని సమాన నిష్పత్తిలో కలిపి, మీరు హెయిర్ మిస్ట్‌ను తయారు చేయవచ్చు. మీ జుట్టును కడిగిన తర్వాత, ఈ మిశ్రమాన్ని  మీ జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయండి. 15 నుండి 20 నిమిషాల వరకు వదిలేసి... తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్యను పూర్తిగా తగ్గించుకవోచ్చు. 

Latest Videos


Image: Getty Images

2. కొబ్బరి నూనె, నిమ్మకాయ
కొబ్బరి జుట్టుకు మంచి పోషణనిస్తుంది, చుండ్రుని తగ్గించడానికి నిమ్మకాయలను ఉపయోగిస్తారు. ఈ రెండు పదార్ధాల నుండి తయారుచేసిన హెయిర్ మాస్క్ జుట్టును ఆరోగ్యంగా, పోషణతో పాటు చుండ్రును వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి అందులో నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి.
 

3. ఫెనుగ్రీక్ సీడ్స్ మాస్క్
మెంతులు అనేక జుట్టు సంరక్షణ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి, వాటిలో ఒకటి చుండ్రును తగ్గిస్తుంది. మెంతి మాస్క్ చేయడానికి, రాత్రంతా నీటిలో కొన్ని మెంతులు నానబెట్టండి. మరుసటి రోజు, ఈ గింజలను మెత్తగా  పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.

Image: Getty Images

4. వేప రసం
అనేక షాంపూలలో వేప ఆకులు ఉపయోగిస్తారు. ఎందుకంటే... ఇవి చుండ్రు సమస్యను పరిష్కరిస్తాయి. కాబట్టి.. వేప ఆకులను మందపాటి పేస్టులా తయారు చేసుకోవాలి.  పేస్ట్‌ని మీ తలకు పట్టించి ఆరనివ్వండి. 10 నుండి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

5. ఆరెంజ్ పీల్ మాస్క్
నారింజ తొక్కలలోని కాల్షియం, మెగ్నీషియం , విటమిన్ కంటెంట్ జుట్టు సంరక్షణకు ముఖ్యమైనవి. చుండ్రును తగ్గించడంలో జుట్టుకు పోషణను అందిస్తాయి. ఆరెంజ్ పీల్ మాస్క్‌ను తయారు చేయడానికి, తొక్కలను మెత్తగా పొడి చేసి, దానికి నిమ్మరసం కలపండి. చిక్కటి పేస్ట్‌ని తలకు పట్టించి, 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. తులసి ఆకులు, ఉసిరి
తులసి ఆకులు, ఉసిరి ఆకులు సహజంగా జుట్టును ఆరోగ్యవంతంగా మార్చడంలో ప్రసిద్ధి చెందాయి, వాటి కలయిక చుండ్రును తగ్గించడానికి గొప్ప మార్గం. కొన్ని తులసి ఆకులను గ్రైండ్ చేసి అందులో ఉసిరి పొడి , నీరు వేసి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. పేస్ట్‌ని మీ తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

garlic


7. వెల్లుల్లి ,తేనె
వాటి యాంటీ ఫంగల్ లక్షణాల కారణంగా, వెల్లుల్లి రెబ్బలు చుండ్రును కలిగించే సూక్ష్మజీవులను తొలగించే ధోరణిని కలిగి ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, తేనెను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మెత్తని పేస్ట్‌ను మీ తలకు పట్టించి 15 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. మీ జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

click me!