నార్మల్ డెలివరీ కావాలంటే ఏం చేయాలి?

First Published | Feb 29, 2024, 2:07 PM IST

నార్మల్ డెలివరీనే గర్బిణులు ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల తల్లులు చాలా తొందరగా కోలుకుంటారు. అందుకే నార్మల్ డెలివరీ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ప్రెగ్నెన్సీ టైం లో ఆడవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే కడుపులో బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ఆరోగ్యంగా పుడతాడు. ముఖ్యంగా తొమ్మిదో నెలలో మీరు ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. డెలివరీకి ఇంకా ఒక్క నెల లేదా పది రోజులు మాత్రమే మిగిలుంది అన్న సమయంలో మీరు కొన్ని ఆహారాలను తింటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

నార్మల్ డెలివరీ అనేది పుట్టబోయే బిడ్డ అభివృద్ధిని బట్టి నిర్ణయించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ బరువు ఎక్కువగా ఉంటే గర్భాశయ ముఖద్వారం నుంచి బయటకు రావడం చాలా కష్టం. దీనివల్ల శిశువు బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. 


పిల్లలు ఎక్కువ బరువున్నా సమస్యే.. తక్కువ బరువున్నా సమస్యే..  పిల్లల సాధారణ జనన బరువు 3.6 కిలోలు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. అయితే తగినంత పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి నార్మల్ డెలివరీ అయ్యేందుకు గర్భిణులు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గర్బందాల్చిన మొదటి నెల నుంచే వీళ్లు ఐరన్ రిచ్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తినాలి. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయ పడుతుంది.మునగకాయలు, గుడ్లు, బీన్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

అలాగే ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను కూడా గర్భిణులు తినాలి. ఇది ప్రెగ్నెన్సీ డయాబెటీస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. దీని కోసం మీరు పప్పులు, చేపలు, చికెన్ ను తినొచ్చు.
 

ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా ఖచ్చితంగా తినాలి. రకాల ఆకుకూరలు, సిట్రస్ పండ్లలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. 

శిశువు ఎముకల అభివృద్ధికి కాల్షియం చాలా చాలా అవసరం. అందుకే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు, పాలు, పాల ఉత్పత్తులు, గింజలు మొదలైనవి తినాలి.

తొమ్మిదో నెలలో కణజాలం దెబ్బతినకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మెగ్నీషియం ఎక్కువగా ఉండే గుమ్మడికాయ గింజలు, బాదం పప్పులను తినాలి. 

బిడ్డ బరువు తక్కువగా ఉంటే నట్స్ ను ఖచ్చితంగా తినండి. 

ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు ఓట్స్, విటమిన్ 6, విటమిన్ బి 12, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి.

తినకూడని ఆహారాలు 

ఉప్పు, కారం ఎక్కువగా ఉంటే ఆహారాలను గర్బిణులు తినకూడదు. 

Latest Videos

click me!