sreeleela
టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో శ్రీలీల ఒకరు. ఏ సినిమా చూసినా శ్రీలీలే కనపడుతోంది. ప్రతి ఒక్క హీరో ఆమెతో నటించాలని ఉవ్విలూరుతున్నారు. ఇక శ్రీలీల డ్యాన్స్ గురించి అయితే.. స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె పర్సనాలిటీ, అందం.. డ్యాన్స్ చేసే విధానానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ముఖ్యంగా శ్రీలీల ఫిజిక్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీలీల తెలుగులో మొదటి సినిమా పెళ్లి సందడి చేసినప్పుడు కొంచెం బొద్దుగానే ఉంది. కానీ.. తర్వాతి సినిమాలకు మరింత సన్నపడిపోయింది. భగవంత్ కేసరిలో అయితే.. నిజంగా స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలా కనపడింది. అసలు శ్రీలీల తన బాడీని ఎలా మెయింటైన్ చేస్తోంది..? ఇంత అందంగా ఉంటుది.. ఏం తింటుంది..? ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో మనం కూడా ఈ రోజు తెలుసుకుందాం..
Sreeleela
శ్రీలీల తన ఫిజికల్, మెంటల్ హెల్త్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందట. దానికోసం ప్రతిరోజూ యోగా చేస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా.. 45 నిమిషాల పాటు యోగా కి కేటాయిస్తుంది. ఈ యోగా సెషన్ ని ఆమె ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ అవ్వదట.
ఇక.. తెలుగులోనే శ్రీలీల చాలా సినిమాలు చేస్తోంది. చాలా తక్కువ సమయంలోనే ఆమె చాలా సినిమాల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇంత బిజీ బిజీగా గడిపింది కాబట్టి.. వర్కౌట్స్ చేయడానికి టైమ్ ఉండదు.. వర్కౌట్స్ స్కిప్ చేస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ.. తనకు ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా... వర్కౌట్స్ ని మాత్రం పక్కన పెట్టదట. ట్రావెలింగ్ లో ఉన్నా, సెట్స్ లో ఉన్నా.. ఏదో ఒక సమయంలో.. వర్కౌట్స్ చేసేస్తుందట.
భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల ఆర్మీ ట్రైనింగ్ కోసం కష్టపడే సీన్స్ ఉంటాయి. దానికోసం ఆమె చాలా వర్కౌట్స్ చేస్తుంది. కార్డియో, రోప్ పుల్లింగ్ లాంటివి.. అయితే.. రియల్ లైఫ్ లో కూడా ఆమె వాటిని రెగ్యులర్ గా చేస్తూ ఉంటుందట. వెయిట్ లిఫ్టింగ్, థ్రెడ్ మిల్ రన్నింగ్ ఇలా ఒక్కటి కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటుందట.
తన మజిల్ స్ట్రైంత్ కోసం, బాడీ టోన్డ్ గా ఉండేందుకు ఎక్కువగా బెంచ్ ప్రెస్సెస్, డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్ లాంటివి ఎక్కువగా చేస్తుందట. ఈ వ్యాయామాలు చేయడం ఆమె కు చాలా ఎక్కువ గా ఇష్టం.
ఇక.. ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటుందట. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయదు. ఉదయాన్నే కచ్చితంగా కొబ్బరి నీరు తాగుతుందట. లోఫ్యాట్ జ్యూస్ తాగుతుంది. తర్వాత ఒక వెజిటేబుల్ సాండ్విచ్ తింటుంది. ఒక పండు, ఒక గిన్నెడు సలాడ్ ని కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటుంది. వీటితో పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కినోవా, సెరల్స్ కూడా తీసుకుంటుందట.
ఇక.. లంచ్ లో ఎక్కువగా సలాడ్స్, కూరగాయలు, బ్రౌన్ రైస్, పప్పు తీసుకుంటారు. బాడీ ఎక్కువగా డీ హైడ్రేటెడ్ గా ఉండేందుకు నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉంటారట.
డిన్నర్ లో మాత్రం చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. అంటే.. ఏదైనా వెజిటేబుల్ సూప్, ఏదైనా సలాడ్ తింటారట. అంతేకాకుండా .. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే.. షుగర్ తక్కువగా ఉండే స్వీట్ ని తీసుకుంటుందట.అయితే.. శ్రీలీల కాఫీ అంటే చాలా ఇష్టమట. అందుకే.. సాయంత్రం వేళ కాఫీని ఆస్వాదిస్తుంది. వాటితో పాటు.. స్నాక్స్ కూడా తీసుకుంటుందట.
ఇక.. శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే.. చివరగా గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించింది. అందులో ఆమె చేసిన డ్యాన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఆ మూవీ పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పర్సనల్ కెరీర్ విషయానికి వస్తే.. డాక్టర్ విద్య చదువుతోంది.