మాస్క్ చాటుకి పెదవులు.. ఇక కళ్లమీద దృష్టంతా

First Published | Jun 26, 2020, 2:00 PM IST

ఒకవేళ లిప్ స్టిక్ వేసుకున్నా.. అది ఎవరికీ కనపడదు కదా., లేదంటే మాస్క్ లకు అంటే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. ఇప్పుడు అమ్మాయిలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు.
 

‘‘కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే’’ఈ పాట అందరూ వినే ఉంటారు. ఇదొక్క పాటే కాదు.. అమ్మాయిల అందాన్ని పొగొడుతూ చాలా పాటలు ఉన్నాయి. ఎందులో చూసినా.. అమ్మాయిల కళ్లకు కాటుక అందమని.. ఎర్రటి పెదాలు అందమనే చెబుతారు.
undefined
అందుకే అమ్మాయిలు కూడా.. ఆ రెండింటికి ఏ మాత్రం లోటు లేకుండా మేకప్ వేసుకొని.. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడతారు. అసలు ప్రస్తుత కాలంలో మేకప్ వేసుకొని అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారనే చెప్పొచ్చు.
undefined

Latest Videos


అయితే.. ఈ కరోనా మహమ్మారి కారణంగా... అమ్మాయిలకు ఓ తీరని సమస్య ఒకటి వచ్చిపడింది. దీంతో.. మేకప్ సరిగా వేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు.
undefined
ఇంతకీ ఏమిటా సమస్య అనుకుంటున్నారా.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మూతికి మాస్క్ తప్పనిసరైన సంగతి తెలిసిందే. దీంతో.. పెదాలకు లిప్ స్టిక్ వేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారట.
undefined
ఒకవేళ లిప్ స్టిక్ వేసుకున్నా.. అది ఎవరికీ కనపడదు కదా., లేదంటే మాస్క్ లకు అంటే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. ఇప్పుడు అమ్మాయిలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు.
undefined
మాస్క్ మూతి వరకే కదా.. కళ్లకి కాదు కదా.. అందుకే అందాల మెరుగులన్నీ.. కళ్లపైనే చూపిస్తున్నారు.
undefined
మాస్కుల ధరించినప్పుడు.. కళ్లు, నదురు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి, ఇకపై అమ్మాయిలు ఐబ్రో, ఐలాషెస్, ఐలైనర్​, ఐ షాడోస్​, డ్రమటిక్​ వింగ్​, మస్కరా వంటి కళ్ల మేకప్​ సామగ్రినే అధికంగా వినియోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
undefined
ఇలానే కొనసాగితే.. లిప్ స్టిక్ లు కొనేవారు తగ్గిపోతారేమో అనే అనుమానం కలుగుతుందా.. అయితే.. దానికి మాత్రం ఛాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు.
undefined
అమ్మాయిలు లిప్ స్టిక్స్ వాడటం పూర్తిగా మానేయడమనేది జరగదని కచ్చితంగా చెబుతున్నారు మేకప్​ పరిశ్రమలోని కొందరు నిపుణులు.
undefined
ప్రస్తుతానికి లాక్​డౌన్​ కారణంగా నిత్యావసర సరుకులకు మాత్రమే అమ్మకాలు పరిమితయ్యాయి. కాబట్టి లాక్​డౌన్​ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత లిప్​స్టిక్​ కొనుగోళ్లు ఎప్పటిలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
undefined
అంతేకాకుండా.. మాస్క్ వేసుకున్నా.. దానికి అంటుకోలి లిప్ స్టిక్స్ కి గిరాకీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
undefined
click me!