ఇలా క్లీన్ చేస్తే.. మీ వెండి వస్తువులు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!

First Published Mar 22, 2024, 12:37 PM IST

వెండి వస్తువులు వాడేటప్పుడు బాగానే ఉంటాయి. కానీ వెంటనే నల్లపడిపోతాయి. ఎంత రుద్దినా మళ్లీ మెరుపురావు. అయితే.. ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. మీ వెండి వస్తువులు మళ్లీ తెల్లగా మెరిసిపోవడం ఖాయం.

silver jewellery

కాళ్లకు పెట్టుకునే పట్టీల దగ్గర నుంచి..దేవుడు గదిలో పూజించే వస్తువుల వరకు దాదాపు అందరూ వెండి వస్తువులే వాడతారు. వెండి వస్తువులు వాడేటప్పుడు బాగానే ఉంటాయి. కానీ వెంటనే నల్లపడిపోతాయి. ఎంత రుద్దినా మళ్లీ మెరుపురావు. అయితే.. ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. మీ వెండి వస్తువులు మళ్లీ తెల్లగా మెరిసిపోవడం ఖాయం.

silver jewellery

1.ముందు ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో డిష్ వాష్ సోప్ వేయాలి. ఇప్పుడు ఆ నీటిలో మీ వెండి వస్తువులు, ఆభరణాలను నానపెట్టాలి. ఇప్పుడు ఏదైనా మెత్తని బ్రష్ తో ఆ గిన్నెలను రుద్ది, కడగాలి. ఆ తర్వాత పొడి టవల్ తో తుడవాలి.
 

Silver Anklets

2.మరో విధంగా కూడా శుభ్రం చేయవచ్చు. బేకింగ్ సోడాలో నీరు పోసి.. మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్టును వెండి ఆభరణాలపై అప్లై చేయాలి. కాసేపటి తర్వాత మంచిగా రుద్దాలి. అంతే.. మళ్లీ మీ పాత వెండి వస్తువులు.. తళతళా మెరిసిపోతాయి.

Silver Anklets

3.అల్యూమినియం ఫాయిల్ తో కూడా వెండి వస్తువులను మెరిపించవచ్చు. ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ ఉంచాలి. దాంట్లో వెడినీరు పోయాలి. అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేయాలి.  ఇప్పుడు అందులో మీ వెండి వస్తువులను ఉంచాలి. కొద్దిసేపు నాననివ్వాలి. తర్వాత.. తీసి కడిగిన తర్వాత ఆరనివ్వాలి. అంతే.. మళ్లీ కొత్తవాటిలా మారిపోతాయి.

4.ఒక గిన్నెలో కొద్దిగా వెనిగర్ తీసుకోవాలి. ఎంత వెనిగర్ తీసుకున్నారో అంతే నీరు పోయాలి. ఇప్పుడు ఆ రెండింటి మిశ్రమంలో వెండి వస్తువులను ఉంచాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
 

Silver Price Today

5.జెల్ కాకుండా ఉండే ఏదైనా టూత్ పేస్ట్ ని తీసుకోవాలి. ఆ టూత్ పేస్ట్ ని.. మంచిగా మీ సిల్వర్ వస్తువులను పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత.. కొద్దిగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత.. నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.

silver jewels

6.నిమ్మకాయ, ఉప్పుతో కూడా వెండి వస్తువులను శుభ్రం చేయవచ్చు. నిమ్మరసంలో ఉప్పు వేసి కలపాలి. దానిని ఒక పేస్టులాగా చేసి... వెండి వస్తువులను అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్రబ్ చేయాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

7.మనం తాగే.. సోడాతో కూడా  వెండి వస్తువులు శుభ్రం చేయవచ్చు. సోడాలో ఉండే బబుల్స్  కూడా..వెండి వస్తువులను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. కొత్తవాటిలా మెరిసిపోతాయి.

8.ఎంత శుభ్రం చేసినా తెల్లగా మారలేదు అనుకుంటే.. వాటిని మీరు పాలిష్ పెట్టించుకోవచ్చు. ఇక.. మీరు ధరించని, వాడని సమయంలో వెండి వస్తువులను సీల్డ్ బ్యాగ్స్ లో స్టోర్ చేసుకోవడం ఉత్తమం.
 

click me!