పాలు ఒక్క ఆరోగ్యానికి మాత్రమే మంచివి అనుకుంటే పొరపాటే. అవును ఇవి మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తాయి. అయితే చాలా మంది చర్మ సంరక్షణకు, మొటిమలను తగ్గించుకోవడానికి, మంచి కలర్ కోసం మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఏదైనా సరే ఎలాంటి హానీ చేయని నేచురల్ పద్దతులను ఉపయోగించాలని చర్మ నిపుణులు చెబుతుంటారు.
raw milk
ఈ మధ్య కాలంలో ముఖానికి పచ్చి పాలను వాడే అలవాటు బాగా పెరిగిపోయింది. అవును పచ్చిపాలతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ రూపు కూడా మెరుగుపడుతుంది. అసలు పచ్చి పాలతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పచ్చి పాలతో ముఖాన్ని కడుక్కోవచ్చా?
మన చర్మానికి మేలు చేసే విటమిన్లు, పోషకాలు పచ్చి పాలలో మెండుగా ఉంటాయి. అలాగే పాలలో లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. దీంతో మీ చర్మం స్మూత్ గా, మంచి రంగు వస్తుంది. పచ్చి పాలలో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చికాకు చర్మాన్ని తగ్గిస్తాయి. అలాగే ముఖం ఎరుపును, మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
పచ్చి పాలతో ముఖానని కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది
మీకు తెలుసా? మన చర్మానికి పచ్చి పాలు ఒక నేచురల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. దీనితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. అలాగే పొడిబారకుండా ఉంటుంది. పచ్చి పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులు చర్మాన్ని తేమగా, హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి.
చర్మాన్ని శుభ్రపరుస్తుంది
మన చర్మానికి నేచురల్ నూనెలు చాలా అవసరం. ఇవి ఉంటేనే మన ముఖం హైడ్రేట్ గా ఉంటుంది. అయితే మనం పచ్చిపాలతో ముఖాన్ని కడుక్కుంటే ఈ నేచురల్ ఆయిల్స్ పోకుండా చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మలినాలు, మురికి, అదనపు నూనెలు తొలగిపోతాయి. పచ్చి పాలు చర్మ రంధ్రాలను బాగా క్లీన్ చేస్తాయి. అలాగే మొటిమలు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి.
skin care
ప్రకాశవంతమైన రంగు
పచ్చి పాలలో లాక్టిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అలాగే ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పచ్చి పాలతో ముఖాన్ని కడగడం వల్ల మీ చర్మం సహజంగా అందంగా మారుతుంది. మంచి రంగు కూడా వస్తుంది. మీరు గనుక పచ్చి పాలతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖంపై ఉన్న నల్ల మచ్చలు, మొటిమల మచ్చలు పూర్తిగా పోయి ముఖం కాంతివంతంగా, అందంగా తయారువుతుంది.
యవ్వన రూపం
పచ్చి పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ ముఖంపై ఉన్న ముడతలను, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి. పచ్చి పాలతో ముఖం కడిగితే చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే స్కిన్ స్థితిస్థాపకత కూడా మెరుగుపడుతుంది. దీంతో మీరు మరింత యంగ్ గా కనిపిస్తారు.
చర్మాన్ని శాంతపరుస్తుంది
కొంతమంది చర్మం చాలా సున్నితంగా లేదా చికాకుగా ఉంటుంది. ఇలాంటి వారికి పచ్చి పాలు మంచి మేలు చేస్తాయి. వీళ్లు పచ్చి పాలతో ముఖాన్ని కడిగితే చర్మ మంట తగ్గుతుంది. ఎందుకంటే పచ్చి పాలలో మంటను చల్లబరిచే లక్షణాలుంటటాయి. దీంతో చికాకు, ఎరుపు చాలా వరకు తగ్గుతాయి. పచ్చి పాలు తామర లేదా రోసేసియా వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.