ముఖంపై ముడతలొచ్చాయా? ఇదిగో ఇలా చేస్తే మచ్చలు, ముడతలు మటుమాయం

First Published | Nov 12, 2023, 3:41 PM IST

Beauty Tips: వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావడం చాలా కామన్. కానీ కొంతమందికి చిన్న వయసులో కూడా ముడతలు వస్తుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే కొన్ని ఫేస్ ప్యాక్ లను ట్రై చేస్తే ముడతలు తగ్గుతాయి. అవేంటంటే? 

వయసెంతైనా సరే ముఖం కాంతివంతంగా, మొటిమలు, మచ్చలు, ముడతలు రావొద్దని మనలో చాలా మంది కోరుకుంటారు. అందుకే ఫేస్ క్రీములు, ఫేషియల్స్ ను ట్రై చేస్తుంటారు. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలను తగ్గించడానికి ఎన్నో సింపుల్ ఫేస్ ప్యాక్ లు ఉన్నాయి. ముడతలు పోవడానికి ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లను ట్రై చేయొచ్చు. ఇవి ముడతలనే కాదు మచ్చలను కూడా కూడా పోగొడుతాయి. అవేంటో ఓ లుక్కేయండి. 

వెన్న , తేనె

ముందుగా ఒక టేబుల్ స్పూన్ వెన్నను తీసుకుని అందులో తేనెను వేసి మెత్తని పేస్ట్ లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. వెన్న, తేనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మన చర్మాన్ని మృదువుగా  చేస్తాయి. అలాగే ముడతలను తగ్గిస్తాయి. 
 

Latest Videos


wrinkles

అశ్వగంధ ఫేస్ ప్యాక్

అశ్వగంధ కేవలం మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధతో ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అశ్వగంధలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అందుకే ఇది ముడతలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల అశ్వగంధ పొడిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక గుడ్డులోని తెల్లసొనను వేసి బాగా మిక్స్ చేయండి. ఈ ప్యాక్ ను ముఖానికి, మెడకు అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

ചര്‍മ്മത്തിന്

గుడ్డు

గుడ్డు కూడా ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం గుడ్డులోని తెల్లసొనను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ లా వేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన ముడతలను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఇక నిమ్మరసం చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 
 

ఓట్ మీల్

ఓట్ మీల్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల సాదా పెరుగును వేసి మిక్స్ చేయండి. ఈ ప్యాక్ ను ముఖానికి, మెడకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఓట్స్ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఇక పెరుగులోని లాక్టిక్ ఆమ్లం కంటెంట్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. 
 

అరటిపండు

అరటిపండు కూడా ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. దీన్ని మెడకు, ముఖానికి అప్లై చేయండి. ఇది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి. అరటిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి పోషణను, తేమను అందిస్తాయి.
 

click me!