నయనతార అందం రోజు రోజుకీ పెరిగిపోవడానికి కారణం ఇదే..!

First Published | Sep 6, 2023, 11:30 AM IST

ఆమె హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీలో ఆమె షారూక్ సరసన నటించింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ఇది కావడం విశేషం. 
 


లేడీ సూపర్ స్టార్ నయనతార.. వరస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమా కెరిర్ ప్రారంభించిన కొత్తలో ఏ దూకుడుతో ఉందో.. ఇప్పుడు కూడా అంతే దూకుడుగా ఉంది. వరసగా సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.ఇక పర్సనల్ లైప్ లోనూ.. ఆమె డైరెక్టర్  విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు కవల పిల్లలకు తల్లిదండ్రులుగా కూడా మారారు.


ఆమె హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీలో ఆమె షారూక్ సరసన నటించింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ఇది కావడం విశేషం. 
 


ఈ సంగతి పక్కన పెడితే.. నయనతార... అందం రోజు రోజుకీ పెరుగుతుందా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఆమె ఇప్పటికీ అంత అందంగా ఉండటానికి గల సీక్రెట్ ఏంటి..;? ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసకుంటారో ఇప్పుడు చూద్దాం..

నయన్ తన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. అందుకే ఆమె నిత్యం యోగా చేస్తారట. కనీసం రోజులో రెండు గంటల పాటు ఆమె యోగా చేస్తారట. జిమ్ లో వర్కౌట్స్ కూడా చేస్తారట. తీసుకునే ఆహారంలోనూ ఆమె జాగ్రత్తలు తీసుకుంటారు.
 


ఇక.. నయనతార.. ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారట. లేదంటే కొబ్బరి నీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారట. ఆ మంచినీటి కారణంగా.. శరీరం ఎప్పుడూ హైడ్రేట్ డెగా ఉంటుంది. అంతేకాకుండా.. పింపుల్స్ సమస్య రాకుండా ఉంటుందట.విటమిన్ సీ ఎక్కువగా ఉండే..  పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట. వాటి వల్ల.. ఆమె చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడానికి సహాయం చేస్తుంది.
 


నయనతార.. కెమికల్ ప్రోడక్ట్స్ కన్నా కూడా... ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడతారు. వాటినే వినియోగిస్తారు కూడా. ఆమె అందం వెనక అసలు రహస్యం ఇదే.ఇది కాక.. ఆమె సన్ స్క్రీన్ లోషన్ ని ప్రతిరోజూ ఉపయోగిస్తారు. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే.. ఆమె అ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. అది రాయకుండా బయట అడుగుపెట్టరు.  ఇలా రాయడం వల్ల సన్ నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుందట.

నయనతార.. ప్రతిరోజూ  సీటీఎం ప్రాసెస్ ని అస్సలు స్కిప్ చేయదట. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్.. ఈ మూడింటిని ప్రతిరోజూ మర్చిపోకుండా చేస్తుందట.ఇక.. ఆమె తన జట్టు అందంగా ఉండేందుకు.. కొబ్బరి నూనె ని రాస్తూ ఉంటారట. కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుంటుందట. దాని వల్ల తన జట్టు  మృదువుగా అందంగా ఉంటుందట.

ఇక.. నయనతార షూటింగ్స్ లేని సమయంలో అస్సలు మేకప్ వేయదట.  తన చర్మం..  స్వేచ్ఛగా  ఊపిరి పీల్చుకునేలా చేస్తుందట. అందుకే.. షూటింగ్ లేకపోతే.. మేకప్ లేకుండా సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుందట.తన కళ్లు అందంగా కనపడేందుకు నయన తార.. సహజమైన కాజల్ ని.. తన కళ్లకు ఉపయోగిస్తారట. వాటితో తన కళ్లు.. మరింత బ్రైట్ గా కనపడతాయని ఆమె చెబుతున్నారు.

Latest Videos

click me!