వయసు రోజు రోజుకీ పెరిగిపోతుంది. కానీ... వయసు ఎంత పెరిగినా.. అందంగా కనిపించాలని అందరూ ఆశపడతారు. ముసలివారిలా కనిపించాలని ఎవరూ కోరుకోరు.
undefined
చాలా మంది తమ వయసు తక్కువగా చెప్పుకునేది కూడా.. అందుకే. అయితే.. మరి అలా కనిపించడం సాధ్యమేనా అంటే... కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఓసారి చూద్దాం..
undefined
కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల యవ్వనంగా కనిపించే అవకాశం ఉంది. ఇవి శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా యవ్వనంగా ఎక్కువ కాలం ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ఆహారాన్ని తినడం వల్ల ముఖంపై ముడతలు కూడా రావు.
undefined
గుమ్మడికాయ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ది చెందాయి. విత్తనాలలో సైటోస్టెరాల్ అనే పెద్ద సమ్మేళనం ఉంటుంది, ఇది పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ను సమతుల్యం చేస్తుంది.
undefined
గుమ్మడికాయ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ యాసిడ్స్ ఉంటాయి. ఇది శారీరక బలాన్ని పెంచడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇవి తినడం వల్ల యంగ్ గా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది.
undefined
ఆయుర్వేదంలో వెల్లుల్లిని గొప్ప ఔషధంగా పనిగణిస్తారు. ఎందుకంటే ఇందులో అల్లిసిన్ అనే భాగం ఉంటుంది, ఇది శరీర ఇంద్రియాలలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
undefined
మీరు ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతుంటే, మీ ఆహారంలో వెల్లుల్లిని కలపండి. వెల్లుల్లి వృద్ధాప్యం యొక్క ప్రభావాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. అందంగా కనిపించేలా చేస్తుంది.
undefined
ఆకుకూరలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఎల్లప్పుడూ సహాయపడతాయి. అందులోనూ పాలకూరలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు ఖనిజాలతో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
undefined
పాలక్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే కూరగాయ. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది.
undefined
క్యారెట్లు, టమోటాలు ఎల్లప్పుడూ చర్మం మరియు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండు ఆహారాలు చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి.
undefined
క్యారెట్లు, టమోటాలలో ఫైటోన్యూట్రియెంట్స్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు, ఇందులో బీటా కెరోటిన్ లుటిన్ కూడా ఉన్నాయి, ఇది యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తాయి.
undefined
అరటి పండ్లలో విటమిన్ ఏ, బీ, సీ పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పండ్లలోని విటమిన్ బి, పొటాషియం.. యవ్వనంగా కనిపించేందుకు సహాయం చేస్తాయి.
undefined