లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ బరువు తగ్గడానికి ఏ చేస్తదో తెలుసా?

First Published | Mar 6, 2024, 9:46 AM IST

ఒకప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. ఈ లేడీ విలన్ బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలను ఫాలో అవుతుంది. అందుకే అతి తక్కువ కాలంలో సన్నగా మారిపోయింది. 

వరలక్ష్మి శరత్ కుమార్ చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించింది. ఈమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందుకే ఈ అమ్మడికి విలన్ గా బాగా ఆఫర్లు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు ఈమె బొద్దుగా, ముద్దుగా ఉండేది. ఇప్పుడు బరువంతా తగ్గి సన్నగా మారిపోయింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కేవలం నాలుగు నెలల్లోనే బరువు తగ్గి అందర్నీ ఆశ్యర్యపరిచింది. ఈ లేడీ విలన్ ఇంత ఫాస్ట్ గా బరువు తగ్గడానికి కొన్ని సీక్రేట్స్ ఉన్నాయి. అవేంటో మనమూ చూసేద్దాం పదండి. 

వ్యాయామం 

వరలక్ష్మి శరత్ కుమార్ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంది. ఈమె కఠినమైన వ్యాయామాలలో పాల్గొంటుంది.  ఈ లేడీ విలన్ ఎక్కువగా కార్డియో, బలాన్ని పెంచే వ్యాయామాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఇది కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడటమే కాకుండా మొత్తం ఫిట్నెస్ ను మెరుగుపరుస్తుంది.


రోజూ ప్రాక్టీస్

ఈ రోజు వర్క్ ఉంది. కుదరదు అనే అనే సాకులన్నింటినీ పక్కన పెట్టేసి.. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతి రోజూ వ్యాయామం చేస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వరలక్ష్మి ప్రతిరోజూ వ్యాయామం చేయకుండా ఉండలేరట. ఇదే ఆమెను ఇంత ఫిట్ గా ఉంచుతుంది.

యోగా, ధ్యానం

వరలక్ష్మి శరత్ కుమార్ రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా యోగా, మెడిటేషన్ కూడా చేస్తుందట. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. యోగా, మెడిటేషన్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇవి ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ గా ఉంచుతాయి. 

varalakshmi

ఆహార నియంత్రణ

ఫుడ్ ను ఎంత తినాలి అనే దానిపై నియంత్రణ  ఉంటేనే బరువు తగ్గడం సులువు అవుతుంది. ఈ విషయంలో వరలక్ష్మీ అస్సలు కాంప్రమైజ్ కాదు. ఈమె ప్రతిరోజూ మోతాదులోనే తింటుంది. ముఖ్యంగా ఏం తింటున్నామనేదానిపై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. అనవసరమైన కేలరీలను ఓవర్లోడ్ చేయకుండా ఆమె శరీరానికి సరైన మొత్తంలో పోషకాలు లభించేలా తింటుంది. 

varalaxmi-sarathkumar

స్నాక్స్

స్నాక్స్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఏవి పడితే అవి తినదు. ఈమె నట్స్, పండ్లు వంటి మంచి పోషకాలున్న ఫుడ్స్ నే స్నాక్స్ గా తింటుంది. ఇవి ఆమె స్టామినాను పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఆమె అతిగా తినకుండా కూడా కూడా సహాయపడతాయి. 

Latest Videos

click me!