పీరియడ్స్ సరిగ్గా రావాలంటే వీటిని తినండి..

First Published May 6, 2023, 12:42 PM IST

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మంది ఆడవారికి సర్వ సాధారణ సమస్య. కానీ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎన్నో వ్యాధులకు సంకేతం. అయితే కొన్ని ఆహారాలు పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేస్తాయి. అవేంటంటే..

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మంది మహిళలకు ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. ఆరోగ్యకరమైన రుతుచక్రం మంచి ఆరోగ్యానికి సూచన. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీ జీవనశైలిని మార్చడానికి సూచన కావొచ్చు. ఈ సమస్య ఎక్కువ కాలం ఉంటే హాస్పటల్ కు ఖచ్చితంగా వెళ్లండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఒక నెలసరికి రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలు గ్యాప్ ఉండటం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పీసీఓఎస్, ఒత్తిడి లేదా మరేదైనా ఆరోగ్య సమస్యలుంటే కూడా ఈ సమస్య వస్తుంది. 


అయినప్పటికీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య నుంచి బయటపడొచ్చు. నిపుణుల ప్రకారం.. సరైన ఆహారాన్ని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య కూడా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే.. 

papaya

బొప్పాయి

ఆరోగ్యకరమైన పండ్లలో బొప్పాయి ఒకటి. ఈ పండులో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచేందుకు బాగా సహాయపడుతుంది. ఇది గర్భాశయ సంకోచానికి బాగా సహాయపడుతుంది. ఈ పండును తింటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తగ్గిపోతుంది. 

వాము

వాము వాటర్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ వాము వాటర్ ను తాగితే దగ్గు, జలుబు నుంచి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఇది రుతుక్రమాన్ని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీనిని నీటిలో మరిగించిన చల్లారిన తర్వాత తాగితే పీరియడ్స్ నొప్పి తగ్గిపోతుంది. 
 

pineapple

అనాస పండు

ఈ పండ్లలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే క్రమరహిత రుతుస్రావానికి సహాయపడతాయి. ఇది పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. 
 

సోంపు

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను తగ్గించడానికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అండోత్సర్గమును ప్రోత్సహిస్తుంది. ఇది రుతుక్రమ తిమ్మిరిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
 

Cinnamon

దాల్చిన చెక్క

ఇన్సులిన్ స్థాయిలు హార్మోన్లు రుతు చక్రాలపై ప్రభావం చూపుతాయి. దాల్చినచెక్క శరీరంలో ఈ ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది గ్లూకోజ్, ఇన్సులిన్ ను ప్రాసెస్ చేసే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కు కూడా సహాయపడుతుంది.
 

Aloe Vera

అలోవెరా

కలబంద జెల్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. కలబంద కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది. కలబందలో ఫోలిక్ యాసిడ్, అమిన్ప్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇది రుతుస్రావానికి కారణమయ్యే హార్మోన్లను నియంత్రిస్తుంది.

click me!