samudra shastra
ముఖం, గడ్డంపై, మెడపై కొంతమంది ఆడవారికి మగవారిలా వెంట్రుకలు ఉంటాయి. కానీ వీటివల్ల ఆడవాళ్లు ఎంతో ఇబ్బంది పడతారు. ఇది వారి అందాన్ని మాత్రమే కాదు.. నలుగురిలో వెక్కిరింతలకు కూడా గురిచేస్తుంది. ముఖంమీద వెంట్రుకలు రావడం లేదా శరీరంలోని ఇతర భాగాలలో వెంట్రుకలు బాగా పెరగడం వెనుక ఎన్నో కారణాలుంటాయి. నిపుణుల ప్రకారం.. జుట్టు రాలడం, శరీరంలో పెరగకూడని చోట వెంట్రుకలు పెరగడం వెనుక ఒక ప్రత్యేక హార్మోన్ ఉంటుంది. ఇదే డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్.
ఈ హార్మోన్ హెయిర్ ఫోలికల్స్ తో బంధిస్తుంది. అలాగే దీనివల్ల జుట్టు రాలుతుంది. అలాగే ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే గనుక ఈ హార్మోన్ సమతుల్యం అవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముఖంపై ఉన్న వెంట్రుకలు పోవాలంటే ఏం చేయాలి?
చియా గింజలతో ముఖంపై ఉన్న వెంట్రుకలు పోయేలా చేయొచ్చు. ఇందుకోసం చియా గింజల్ని నీళ్లలో కలిపి ఉదయాన్నే పరిగడుపున తాగాలి. ఈ చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించి డైహైడ్రోటెస్టోస్టెరాన్ సమస్యను తగ్గిస్తాయి.
అలాగే గుమ్మడి గింజల నూనె కూడా అవాంఛిత రోమాలు లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఈ నూనెను ప్రతి వారం వెంట్రుకల రాయండి. ఇది డిహెచ్ టి ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. కొన్ని చుక్కల స్పియర్ మింట్ ఆయిల్ ను ముఖానికి పెడితే కూడా అవాంఛిత రోమాలు పెరగకుండా ఉంటాయి.
అలాగే మధ్యాహ్నం బ్రోకలీని ఖచ్చితంగా తినండి. దీనిలో పుష్కలంగా ఉండే జింక్ డిహెచ్టి ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే పండ్లపై గుమ్మడి గింజలను వేసి తినండి. అలాగే ప్రతిరోజూ ఉదయం ఎండలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండండి. దీనివల్ల డిహెచ్ టి హార్మోన్ సమతుల్యం అవుతుంది. ఈ డిహెచ్ టి హార్మోన్ సమతుల్యంగా ఉంటే ముఖంపై అవాంఛిత రోమాలు పెరగడం తగ్గుతుంది. అలాగే మీ జుట్టుకూడా పెరుగుతుంది.