ఇదేం ఆఫర్... కరోనా వైరస్ ఎక్కించుకుంటే రూ.3లక్షలా..!

First Published | Mar 11, 2020, 2:11 PM IST

కొందరు సైంటిస్టులు అదేదో బంపర్ ఆఫర్ లాగా ప్రకటించారు. అలా వైరస్ ఎక్కించుకుంటే.. రూ.3లక్షల నగదు కూడా ఇస్తారట.  ఆ వైరస్ ఎక్కించి.. వాళ్లకు కావాల్సిన పరీక్షలు వాళ్లు  చేసుకుంటారు.
 

కరోనా వైరస్ పేరు చెబితనే చాలా మంది వణికిపోతున్నారు. సాధారణ జలుబు, తుమ్ములను చూసే.. వామ్మో కరోనా వచ్చిందేమో అని కంగారు పడుతున్నారు. ఇప్పటి వరకు ఆ వైరస్ ఏంటో కనుక్కన్నారు కానీ.. దానికి మందు కూడా కనిపెట్టలేకపోయారు. అలాంటిది ఎవరైనా పోయి పోయి అలాంటి వైరస్ సోకాలని కోరుకుంటారా?
కానీ లండన్ లోని కొందరు సైంటిస్టులు అదేదో బంపర్ ఆఫర్ లాగా ప్రకటించారు. అలా వైరస్ ఎక్కించుకుంటే.. రూ.3లక్షల నగదు కూడా ఇస్తారట. ఆ వైరస్ ఎక్కించి.. వాళ్లకు కావాల్సిన పరీక్షలు వాళ్లు చేసుకుంటారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... చైనాలోని వుహాన్ లో తొలుత ఈ వైరస్ మొదలైంది. ఆ తర్వాత నెమ్మదిగా.. ప్రపంచ దేశాలకు పాకేసింది. ఇప్పటి వరకు చైనాలో 3వేల మందికిపైగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్ లో కూడా దీని ప్రభావం మరింత పెరిగింది. ఇటీవల భారత్ కి కూడా పాకేసింది. మొన్నటికి మొన్న తెలంగాణలో ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకగా.. ఈ రోజు ఏపీలో కూడా ఓ వ్యక్తికి వైరస్ సోకింది. అతను ఇరాన్ నుంచి రాగా... ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇప్పుడు వైరస్ సోకిన వాళ్లని... వైరస్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారితో కనీసం ఫ్రీగా మాట్లాడటానికి కూడా ఎవరూ సాహసం చేయడంలేదు. అలాంటి వైరస్ ని ఎక్కించుకుంటారా అని లండన్ శాస్త్రవేత్తలు కోరడం విశేషం.
రూ.3లక్షల క్యాష్ ఇస్తామని కూడా వారు ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే... ఈ ఆఫర్ కి చాలా మంది మేం ఎక్కించుకుంటామంటే.. మేము ఎక్కించుకుంటామంటూ ముందుకు రావడం గమనార్హం
అయితే... మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్లని మాత్రమే ఈ వైరస్ ఎక్కించుకోవడానికి తీసుకుంటామని ఆ శాస్త్రవేత్తలు చిన్న కండీషన్ పెట్టడం గమనార్హం.
తమ పరిశోధనల కోసం ఆరోగ్యంగా ఉన్న వారిని పలు బ్యాచులుగా విభజిస్తున్నారు సైంటిస్టులు. వారికి ఈ కరోనా వైరస్‌లను ఎక్కించి, పరిశోధనలు జరుపుతారు.
ఈ వైరస్‌లు ఎవరైనా తమ శరీరంలోకి ఎక్కించుకుంటే కాస్త శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అంతే తప్పా... ప్రాణాపాయం ఏమీ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.
ఆరోగ్యవంతులకు ఈ వైరస్ ఎక్కించి వారిపై పలు పరిశోధనలు చేసి తద్వారా మందు కనుగొనాలని పరిశోధకులు చూస్తున్నారు. మరి అలా అయినా దీనికి మందు కనుక్కుంటారేమో చూడాలి.

Latest Videos

click me!