103ఏళ్ల వృద్ధుడితో 27ఏళ్ల యువతి ప్రేమాయణం.. గర్భం రావడంతో..

First Published | Mar 9, 2020, 12:02 PM IST

రోజూ ఆ వృద్ధుడితో సమయం గడపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అతని ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు.

ఆమె పడుచు యువతి. అతనేమో.. కాటికి కాళ్లు చూపుకొని కూర్చున్న వ్యక్తి. అనూహ్యంగా... ఆ ముసలాయన ప్రేమలో ఆ యువతి పడిపోయింది. ఎదరెదురు ఇళ్లల్లో ఉండేవారు ప్రేమలో పడటమే కాకుండా శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో.... యువతి గర్భం దాల్చింది.
అంతే.. ఇరువైపులా కుటుంబసభ్యులకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండోనేషియాకి చెందిన 27ఏళ్ల యువతి ఓ యువకుడిని ప్రేమించింది. తీరా పెళ్లిచేసుకునే సమయానికి ఆమె ప్రేమికుడు హ్యాండ్ ఇచ్చాడు. దీంతో సదరు యువతి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ బాధలో ఉన్న ఆమెకు.. వాళ్ల ఇంటి ఎదురుగా ఉండే 103ఏళ్ల వృద్ధుడు అండగా నిలిచాడు. ఆమెలో ధైర్యం నింపాడు.
అతను ఇచ్చిన భరోసా, చెప్పిన మాటలకు ఆమె ఆకర్షితురాలైంది. దీంతో రోజూ ఆ వృద్ధుడితో సమయం గడపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అతని ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు.
దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం ఇరు వైపులా కుటుంబసభ్యులకు తెలియజేశారు. వెంటనే పెళ్లి ముహుర్తం పెట్టించుకొని.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
విచిత్రం ఏమిటంటే.. వీరి పెళ్లికి ఇరువైపులా కుటుంబసభ్యులు ఏ మాత్రం అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం.
ఇండోనేషియాలో.. ఇలా ఎక్కువ వ్యత్సాసంతో పెళ్లిళ్లు జరగడం చాలా సహజమట. గతంలో ఓ 70ఏళ్ల వృద్ధుడిని 16ఏళ్ల యువతి పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో.. 103ఏళ్ల తాతను 27ఏళ్ల పడుచు యువతి పెళ్లాడింది.
వీరి పెళ్లి గత నెలలో చోటుచేసుకోగా... ఆలస్యంగా ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యియి.
ఈ దంపతులిద్దరూ... వరుడి ఇంట్లోనే తమ కొత్తకాపురం పెట్టారట. అంతేకాకుండా.. వరుడే.. వధువు కుటంబసభ్యులకు కట్నం కూడా చెల్లించాడట.
ఇండోనేషియన్ కరెన్సీలో 5మిలియన్లు కట్నంగా చెల్లించాడు. అదే మన కరెన్సీలో రూ.25,500 కావడం గమనార్హం. దీనితోపాటు ఓ బంగారు ఉంగరం కూడా ఇచ్చాడట.
వీరి పెళ్లిపై వధువు తో ఓ మీడియా సంస్థ మాట్లాడగా... తన భర్త వయసు ఎంతో తనకు సరిగ్గా తెలీదని చెప్పిందట. కానీ 100ఏళ్లు దాటి ఉంటాయని మాత్రం తెలుసు అని చెప్పడం విశేషం. అయితే.. ఈ వార్తలో ఎంత నిజముందో మాత్రం క్లారిటీ లేదు.

Latest Videos

click me!