బస్సులో మహిళతో అసభ్య ప్రవర్తన, హస్తప్రయోగం.. వ్యక్తి అరెస్ట్..

First Published | May 19, 2023, 12:59 PM IST

ఓ వ్యక్తిబస్సులో అనుచితంగా ప్రవర్తించాడు. మహిళ నడుంమీద మోచేత్తో రాయడమే కాకుండా.. ఆమె పక్కనే కూర్చుని హస్తప్రయోగం చేశాడు. ఆ మహిళ అరవడంతో.. అతడిని అరెస్ట్ చేశారు.

masturbating

కొచ్చి : కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులో ఓ వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. హస్తప్రయోగానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ దీన్ని వ్యతిరేకించింది. చివరికి కండక్టర్, డ్రైవర్ల సహాయంతో అతడిని పోలీసులకు పట్టించింది. ఈ మేరకు ఈ కథనాన్ని ఇన్ స్టా గ్రాంలో వీడియోతో సహా పోస్ట్ చేసింది. 

ఇప్పుడు ఈ పోస్ట్ 137వేల లైక్‌లతో, 216వేల షేర్లు, 7,848 కామెంట్లతో వైరల్‌గా మారింది. ఎక్కువగా ఈ పోస్టును మహిళలు స్పందించారు.  వారిలో చాలా మంది మహిళలు ప్రతీ రోజు తాము ఏదో రూపంలో ఇలాంటి వేధింపులు ఎదుర్కుంటామని చెప్పుకొచ్చారు. ధైర్యంగా ఇలాంటి చర్యలకు బుద్ది చెప్పావని మెచ్చుకున్నారు. తమకు మాట్లాడే ధైర్యం లేకపోయిందని చెప్పుకొచ్చారు. 

నందితా శంకర అనే పిటిషనర్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ 'మస్తానీ'లో మొత్తం ఎపిసోడ్‌ను వివరిస్తూ, సంఘటన సమయంలో తాను తీసిన వీడియోలోని కొన్ని భాగాలతో పాటు నిందితులు పారిపోవడం, పట్టుకోవడంతో సహా వీడియోను పోస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తిని కోజికోడ్‌కు చెందిన సవాద్ షాగా నెడుంబస్సేరి పోలీసులు గుర్తించారు.

త్రిస్సూర్ నుండి ఎర్నాకులం వెళ్తున్న కెఎస్ ఆర్టీసీ ఫాస్ట్ ప్యాసింజర్ బస్సులో ఒక మహిళ పక్కన కూర్చొన్న వ్యక్తి.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. హస్తప్రయోగం చేశాడు. సదరు 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.


కోజికోడ్‌కు చెందిన సవాద్ షా అనే నిందితుడు అంగమలీలో ఆ బస్సు ఎక్కాడు. మహిళ దగ్గర కూర్చొని ఆమెను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. ఆమె అతనికి వీలైనంత దూరం జరగడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత అతను హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడని, మహిళ వెంటనే ప్రయాణికులను అలర్ట్ చేయడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. కండక్టర్‌, బస్సు డ్రైవర్‌ అతడిని వెంబడించి పోలీసులకు అప్పగించారు.

వృత్తిరీత్యా మోడల్ అయిన నందితా శంకర్  ఒక రోజు తర్వాత, బుధవారం ఈ ఘటన మొత్తాన్ని  వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేయడంతో ఈ సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. నందిత ధీటుగా స్పందించడం వల్లే ఆ వ్యక్తిని అరెస్ట్ అయ్యాడని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నందిత పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, షా వచ్చి లేడీస్ సీట్లో.. ఆమె, మరొక మహిళ మధ్య కూర్చున్నాడు. ఆ తరువాత అతను తన మోచేతిని ఆమె నడుముపై రుద్దడం ప్రారంభించాడు. దీంతో ఆమె వీలైనంత దూరం వెళ్ళడానికి ప్రయత్నించింది. "తరువాతి క్షణంలో, అతను నా పక్కన కూర్చొని హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు. ఇక తట్టుకోలేక నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను" అని నందిత వీడియోలో తెలిపింది. 

వీడియోలో, నందిత నిందితుడిని ఎదుర్కోవడం, అతనిపై అరుస్తున్నట్లు చూడవచ్చు. అయితే, షా మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని బుకాయిస్తున్నాడు. అంతేకాదు బస్సు ఆపాలంటూ కండక్టర్‌ను కోరాడు, అయితే నందితకు మద్దతుగా కండక్టర్, వాహనాన్ని ఆపవద్దని డ్రైవర్‌ను కోరాడు. 

నందిత మాట్లాడుతూ.. "నాకేమైనా ఇబ్బంది ఉందా అని కండక్టర్ కె కె ప్రదీప్ నన్ను అడిగాడు. నేను అవును అని చెప్పాను. ఆ తరువాతే  బస్సును పక్కకు ఆపి, పోలీసులను అప్రమత్తం చేసారు. అకస్మాత్తుగా, ఆ వ్యక్తి కండక్టర్‌ను దూరంగా నెట్టి పారిపోవడానికి ప్రయత్నించాడు. కండక్టర్, డ్రైవర్ అతనిని వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు వచ్చిన తరువాత వారికి జరిగిన విషయం వివరణాత్మక వాంగ్మూలం ఇచ్చాను, వారు కేసు నమోదు చేశారు”అని నందిత వీడియోలో తెలిపారు.

నిందితుడిపై ఐపిసి సెక్షన్ 354 (స్త్రీ నమ్రతను కించపరిచే ఉద్దేశ్యంతో దాడి చేయడం లేదా క్రిమినల్ బలవంతం చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. గురువారం మాట్లాడుతూ, నందిత తనకు సహాయం చేసిన బస్సు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అలాంటి అనుభవాలను ఎదుర్కొన్న మహిళలందరికీ తన స్పందన ఓ సందేశమని కూడా చెప్పింది. "మహిళలు తీవ్రంగా, వెంటనే స్పందించాలి, అలాంటి వ్యక్తులను చట్టం ముందు తీసుకురావాలి" అని నందిత అన్నారు.

Latest Videos

click me!