కారు డ్రైవింగ్ సీటులో కుక్క.. ఓ మందుబాబు అతి తెలివి.. చివరికి..

First Published | May 18, 2023, 9:50 AM IST

కుక్క కారు డ్రైవింగ్ చేస్తుందా? చేసిందని చెప్పాడో వ్యక్తి.. తాను ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి.. కారు ఆపగానే.. కుక్కను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాడు. కానీ, చివరికి.. 

కొలరాడో : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడకుండా ఉండడానికి మందుబాబులు అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మత్తులో గమ్మత్తుగా వారు తెలివి పనిచేస్తుంటుంది. అయితే, పోలీసులు కనిపించగానే బండి వదిలి పారిపోవడం..వారికి దొరకకుండా స్పీడ్ గా వెళ్లిపోవడమో..  లేదంటే తాను తాగలేదని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకోవడానికి నిరాకరించడం చేస్తుంటారు. 

అదీ కాకుంటే.. తాగని వ్యక్తిని డ్రైవర్గా పెట్టుకుని వెళుతుంటారు. కొలరాడోలో  ఓ వ్యక్తి చేసిన చర్య.. ముక్కు మీద వేలేసుకునేలా ఉంది.ట్రాఫిక్ పోలీసులు తనని ఆపగానే..  కామ్ గా తన పెంపుడు కుక్కను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టాడు. 


దీంతో డ్రైవింగ్ చేసింది ఎవరో తెలియక పోలీసులు కాసేపు తికమక పడ్డారు. ఈ ఘటన అమెరికాలోని కొలరాడోలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..యూఎస్ లోని కొలరాడో రోడ్డు మీద ఓ కారు స్పీడుగా వస్తోంది. ఆ రూట్ లో కార్లను చెక్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు అందరిలాగే అతడి కారును కూడా ఆపారు. 

వాహనాన్ని ఆపగానే అందులో ఉన్నవారు దిగి ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి రావడం.. తమ పేపర్లన్నీ సరిగానే ఉన్నాయని చూపించి, ముందుకు వెళ్లడం  మామూలుగా జరిగే సంగతి. కానీ సదరు కారులో నుంచి  ఎవరు దిగలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు కారు దగ్గరికి వెళ్లి చూడగా.. ఒకసారిగా షాక్ అయ్యారు.

డ్రైవింగ్ సీట్లో.. ఓ బుజ్జి కుక్క కూర్చొని ఉంది. అది చూసిన పోలీసులు నిర్ఘాంత పోయారు. ఇంతసేపు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది కుక్క నా అనుమానం ఒక్క క్షణం వారికి  కలిగింది. కాసేపు అయోమయంలో పడిపోయారు.. కారును పరికించి చూడగా ప్యాసింజర్ సీట్లో ఓ వ్యక్తి ఉండడం గమనించారు..  వెంటనే, కారును కుక్క నడపడం ఏంటి అంటూ ఆరా తీయగా.. అది నిజమేనని కారు తాను నడపలేదని బుకాయించాడు.

అది నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిని ప్రదర్శించగా.. మొత్తానికి సీట్లు మార్చుకున్నట్లుగా ఒప్పుకున్నాడు.  దీంతో అనుమానం వచ్చినప్పుడు పోలీసులు అతను తాగి ఉన్నాడేమోనని పరీక్షలు నిర్వహించారు. అందులో తగినట్లుగా తేలింది. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకకుండా పరార్ అయ్యేందుకే ఇలాంటి పని చేశాడని అర్థం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేయాలని చూశారు.  

అతని అది గమనించిన అతను పరార ఎందుకు ప్రయత్నించాడు.. కారు దిగి పారిపోయాడు.  కానీ వెంటనే అప్రమత్తమైన పోలీసులు 20 గజాల దూరంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కను జంతు సంరక్షణ అధికారి పర్యవేక్షణలో ఉంచారు. 

Latest Videos

click me!