ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ

First Published | Jul 11, 2023, 8:33 AM IST

ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ తన వీలునామాలో తన భాగస్వామి మార్తా ఫాసినాకు 100 మిలియన్ యూరోలు అంటే రూ. 900 కోట్లకు పైగా చెందాలని వీలునామా రాశారు. 

ఇటలీ :  ఇటలీ దివంగత ప్రధాని సిల్వియో బెర్లుస్కోని రాసిన వీలునామా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇది సర్వత్ర చర్చనీయాంశంగా మారి వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీలునామాలో ఏముందంటే.. ఆయన తన ఆస్తిలో రూ.900కోట్లను తన ప్రియురాలికి దక్కాలని రాసుకొచ్చారు. ఇటలీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని గత నెలలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాసిన వీలునామా ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. 

బతికున్న సమయంలో రాసిన ఈ వీలునామాను ఇటీవల.. అతని ఐదుగురు సంతానం, ఇతర ప్రత్యక్ష సాక్షుల ముందు చదివారు. సిల్వియో బెర్లుస్కోని మొత్తం ఆస్తి  ఆరు బిలియన్ యూరోలు.. అంటే రూ.54వేల కోట్లు. అందులో100 మిలియన్ యూరోలను అంటే దాదాపు రూ. 900 కోట్లను.. తన ప్రియురాలు మార్టా ఫాసినా(33)కు చెందేలా ఆయన వీలునామాలో పేర్కొన్నారు. మార్టాను ఆయన పెళ్లి చేసుకోలేదు.  


అయినప్పటికీ సిల్వియో బెర్లుస్కోని  తన వీలునామాలో మార్టాను  భార్యగానే పేర్కొన్నారు. 202లో మార్చిలో మార్టా ఫాసినా, సిల్వియో బెర్లుస్కోని మధ్య రిలేషన్ మొదలయ్యింది. మార్టా ఫాసినాకు 33 ఏళ్ళు.  ఆమె ఇటలీ పార్లమెంటులోని దిగువసభ సభ్యురాలు. చాంబర్ ఆఫ్ డిప్యూటీస్ కి 2018 నుంచి మార్టా ఫాసినా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిల్వియో బెర్లుస్కోని పార్టీలో కూడా ఆమె సభ్యురాలిగా ఉన్నారు.

సిల్వియో బెర్లుస్కోని 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. సిల్వియో బెర్లుస్కోని వ్యాపారవేత్త, మీడియా దిగ్గజం. ఫోర్జా ఇటానియా అనే లిబరల్ కన్జర్వేటివ్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ప్రజా ప్రతినిధిగా సేవలు అందించారు. సిల్వియో బెర్లుస్కోని మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన సంతానంలోని మరీనా, పీర్ సిల్విలోలు చూసుకోబోతున్నారు. 

బెర్లుస్కోనీ సంపద ఐదు బిలియన్ యూరోలుగా అంచనా వేయబడింది. ఇందులో పబ్లిక్‌గా వర్తకం చేయబడిన ఫిన్‌ఇన్‌వెస్ట్, దీని విలువ 2.8 బిలియన్ యూరోలు, రియల్ ఎస్టేట్ హోల్డింగ్‌లు దాదాపు 700 మిలియన్ యూరోలు, స్టాక్‌లు, కళాఖండాలు, నగదు.

బెర్లుస్కోనీ "మార్టా ఫాసినాకు 100 మిలియన్లు, అతని సోదరుడు పాలోకు 100 మిలియన్లు,  మాఫియాతో సంబంధం ఉన్నందుకు జైలు శిక్ష అనుభవించిన మాజీ చట్టసభ సభ్యుడు మార్సెల్లో డెల్'ఉట్రీకి 30 మిలియన్లు రాసినట్లు నివేదిక పేర్కొంది. బెర్లుస్కోనీ పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు ఫిన్‌ఇన్వెస్ట్‌లో 53% వాటా ఉంది. 

ది గార్డియన్ ప్రకారం, బెర్లుస్కోనీ గత సంవత్సరం ఎల్లో కలర్ నోట్‌ప్యాడ్‌పై చేతితో వీలునామా రాశారు. అతను తన వ్యాపారేతర సంపదలో 60%ని మెరీనా, యు పియర్ సిల్వియోలకు చెందాలని తెలిపారు. అతని మొదటి వివాహం నుండి అతని ఇద్దరు పిల్లలు, రెండవ వివాహం నుండి ముగ్గురు పిల్లలు బార్బరా, ఎలియోనోరా లుయిగిలున్నారు. ఈ ముగ్గురికి మిగిలిన 40% పంచారు.
 

Latest Videos

click me!