పులిని తరిమిన ఆవులు.. భయంతో తోకముడిచిన వ్యాఘ్రం... వీడియో వైరల్..

First Published | Jun 20, 2023, 10:38 AM IST

భోపాల్‌లోని కెర్వాలోని వ్యవసాయ క్షేత్రంలో ఓ అద్భుతమైన వీడియో వెలుగు చూసింది. ఆవుల మంద ఓ పులిని తరిమికొట్టింది.

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. ఐకమత్యం ఎంతటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొనే బలాన్ని ఇస్తుందన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. చలిచీమల చేతచిక్కి విషసర్పం చస్తుందన్న సుమతీ శతకకారుడి మాట నిజమయ్యింది. 

తోటి ఆవుమీద పులి దాడిచేయడంతో.. కోపానికి వచ్చిన ఆవులమంద ఆ పులిని తరిమికొట్టిన ఘటన వెలుగు చూసింది. ఆవుల ఫారమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ అద్భుతమైన దృశ్యం నమోదయ్యింది. 


ఈ వీడియోలో ఆవుల మంద పులిని బెదరగొడుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. భోపాల్‌లోని కెర్వాలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం అర్థరాత్రి ఈ దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. 

ఈ వీడియోలో ముందు ఓ ఆవుపై పులి దాడి చేయడం కనిపించింది. ఆ తర్వాత మందలోని ఇతర ఆవులు పులిని చుట్టుముట్టాయి. దీంతో పులి తోకముడిచింది. వేటను వదిలి దూరంగా పలాయనం చిత్తగించింది. 

tiger, Army War College (AWC) campus

ఆ తర్వాత పులి సుమారు మూడు గంటలపాటు తాను వేటాడిన ఆవును పట్టుకపోవాలని ప్రయత్నించింది. కానీ గాయపడిన ఆవు చుట్టూ మంద కాపలాగా ఉండడంతో మళ్లీ దాడి చేయలేకపోయింది.

ఈ విషయాన్ని ఫార్మ్ నిర్వాహకులు తెల్లారి గుర్తించారు. గాయపడిన ఆవుకు చికిత్స అందిస్తున్నామని, దాని పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. 76 ఎకరాల పొలంలో మొత్తం 50 సీసీ కెమెరాలు ఉన్నాయి.

Latest Videos

click me!