విడాకుల సెలబ్రేషన్.. వెడ్డింగ్ డ్రెస్ తగలబెడుతూ ఫోటోషూట్..

First Published | Apr 26, 2023, 11:02 AM IST

విడాకులను ఫోటోషూట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది ఓ మహిళ.. ఆ ఫొటోషూట్ లో తన వైవాహిక జీవితపు జ్ఞాపకాలను చెరిపేసి.. ఫ్రీ అయ్యానంటుంది. 

అమెరికా : ఇటీవలి కాలంలో అనేక కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువవుతున్నాయి. మనసులు కలవకపోతే.. జీవితభాగస్వామి నచ్చకపోతే.. అడ్జెస్ట్ కావడంలేదు. విడాకులతో దూరమై ఇద్దరూ హాయిగా బతికేస్తున్నారు.

ఇలాంటి ఓ ఘటనలో యుఎస్‌కి చెందిన ఒక మహిళ మరో అడుగు ముందుకు వేసింది. వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ లాగా విడాకులను ఫోటో షూట్ చేయించుకుంది. 


ఈ ఫొటో షూట్ లో ఏం చేసింది..? అనే కదా మీ డౌట్... ఫోటోషూట్ సమయంలో తన వివాహ దుస్తులను తగలబెట్టింది. అలా తన విడాకుల వేడుకలను జరుపుకుంది. 

ఓర్నీ.. ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా? నిజ్జంగా నిజం అలాగేజరిగింది. లారెన్ బ్రూక్ అనే 31 ఏళ్ల మహిళ.. తన 10 సంవత్సరాల వివాహం జీవితం తర్వాత ఇటీవలే విడాకులు తీసుకుంది. 

ఆమె 2012లో వివాహం చేసుకుంది. సెప్టెంబర్ 2021లో తన భర్త నుండి విడిపోయింది. ఈ ఏడాది జనవరిలో విడాకులు మంజూరయ్యాయి.

ఇలా చేయడం వెనుక ఉద్దేశం ఏంటటా అంటే... “విడాకులు కఠినమైనవి, ఇబ్బందికరమైనవి, బాధాకరమైనవి.. అనే వాస్తవాన్ని చూపించడమే. రోజూ ఉదయాన్నే నిద్రలేచి ఏడ్చిన రోజులు ఉన్నాయి. 

నా జీవితం మెరుగుపడదని నాలో నేను కుంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది జరిగలేదు. విడాకులు తీసుకుంటున్నాం.. కానీ పిల్లల్ని చూసుకోవడానికి జీవితాంతం ఒకరికొకరు కష్టపడాలి. నేను దాని నుండి బయటపడ్డాను, నేను మరొక వైపుకు వచ్చాను. ఇక పొద్దున లేవగానే ఏడవను. ఇప్పుడు నేను చాలా బాగా ఉన్నాను”అని లారెన్ మిర్రర్ అన్నారు.

ఆమె ఫోటోషూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్యూబిటీ అనే పేజీ షేర్ చేసింది. లారెన్ ఎరుపు రంగు దుస్తులు ధరించి తన పెళ్లి ఫొటోలను చింపేయడాన్ని చూడవచ్చు. ఆమె తన పెళ్లి బట్టల్ని కూడా కాల్చడం కనిపించింది.

ఈ ఫొటో షూట్ ను ఫోటోగ్రాఫర్ అయిన ఆమె తల్లి లారెన్ ఫెలిసియా బౌమన్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో ఆమె తన ప్రాణ స్నేహితురాలు కూడా పాల్గొంది.

Latest Videos

click me!