ఆదిపురుష్ రిలీజ్ నేపథ్యంలో వైరల్ అవుతున్న 'ఛప్రి'..!! ట్రెండింగ్‌ ఎందుకంటే...?

First Published | Jun 17, 2023, 10:45 AM IST

శుక్రవారం 'ఆదిపురుష్' సినిమా విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో 'ఛప్రి' పదం వైరల్‌గా మారింది. అసలు ఈ 'ఛప్రి' అంటే ఏంటీ..  ఎందుకు వైరల్ అవుతోంది? ఆదిపురుష్ సినిమాకీ దీనికీ సంబంధం ఏంటీ?

అరేహ్ క్యా ఛప్రీ జైసా కప్డే పెహ్నా హై?.. అనేది బాగా వినిపించే మాట.. అంటే ఇండియాలో పుట్టిపెరిగిన వారికి ఏదో ఒక సందర్బంలో ఈ పదం వినే ఉంటారు. ఒకవేళ వినకపోయిఉంటే అర్థాన్ని అర్థం చేసుకోవడానికి డిక్షనరీ లేదా గూగుల్ లో కూడా సెర్చ్ చేయచ్చు. 'ఛప్రి' అని పిలవడం రోజువారీ పట్టణ యాసగా మారింది. దీన్ని పిచ్చి ఫ్యాషన్ ను ఫాలో అయ్యే లేదా భాష లేదా సంస్కృతికి అనుగుణంగా లేని వ్యక్తికి ఆపాదించబడుతుంది.

ఇంతకీ ఛప్రి అనే పదానికి అర్థం ఏమిటి?
దీని గురించి మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే.. దాంట్లో ఛప్రీకి అర్థం “బాధ్యతారాహిత్యం గల వ్యక్తి’’ అని వస్తుంది. తన డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ తో ఫ్యాషన్ గా ఉన్నాననుకుని.. అతి మామూలుగా, ఫ్యాషన్ కు ఆమడదూరంలో ఉండే వ్యక్తి. అతని వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండకపోగా.. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసే వ్యక్తులు. ఇలా ఛప్రీ అనే పదాన్ని రకరకాల సందర్భాల్లో వాడొచ్చు. 


అయితే, ఛప్రి అనే పదం ఓ కులాన్ని దూషించడమే అనే వాదన ఉంది. ఛప్రి పదానికి అర్థం కనిపెట్టే క్రమంలో ఇది ఓ కులాన్ని చిన్నచూపుగా చూసే పద ప్రయోగం అని తేలింది. మనలో చాలామంది మాట్లాడే సమయంలో తెలియకుండానే ఇలాంటి అనేక పదాలను వాడుతుంటారు. 

రెడ్‌డిట్‌లోని కొన్ని థ్రెడ్‌లను చూస్తే...  ఛప్రి అనే పదం 'చప్పర్' అనే పదం నుండి వచ్చిందని తెలుస్తుంది. ఇంటి పైకప్పులను అల్లేవారు, నేతకారుల కులంగా దీన్ని చెబుతారు. ఇక చప్పర్ కు మరో అర్థం కచ్చా ఇళ్ళు లేదా గుడిసెల అని. ఈ పదం అర్థం తెలియకుండానే రోజువారీ ఎదుటి వ్యక్తులను వెక్కిరించడానికి ఉపయోగిస్తుంటారు. 

ఛప్రి ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్‌ అయింది?
ప్రభాస్ 'ఆదిపురుష్' ఫస్ట్ టీజర్ విడుదలైనప్పుడే ఇదంతా మొదలైంది. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లుక్ అలాగే వత్సల్ షేత్ పచ్చబొట్టు పొడిచిన ఇంద్రజీత్ క్యారెక్టర్ లుక్ లు చూసిన తరువాత నెటిజన్లు ‘ఛప్రీ’ ట్యాగ్‌ని తీసుకువచ్చారు. అది ఆదిపురుష్ సినిమా రిలీజ్ తో పీక్స్ కు చేరుకుంది.

ఓం రౌత్ రచన, దర్శకత్వం వహించిన ఆదిపురుష్ వాల్మీకి ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. సినిమాలో వరుసగా రాఘవ, జానకి, లంకేష్ పాత్రలు పోషిస్తున్నారు.

చాలామంది ట్విట్టర్ వినియోగదారులు పవిత్ర పౌరాణిక పాత్రల 'ఆధునిక' వస్త్రధారణ లేదా వేషభాషలతో అప్ సెట్ అయ్యారు. దీంతో ట్విట్టర్ పూర్తిగా దీనికి సంబంధించిన మీమ్స్ తో నిండిపోయింది. 

ఇక 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన అత్యంత భారీ భారతీయ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం రెండు సంవత్సరాల కాలంలో అనేకసార్లు వాయిదాలు పడింది. వివాదాలను ఎదుర్కొంది. చివరికి రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. 

Latest Videos

click me!