వార్నీ.. టమాటా పొలంలో సీసీ కెమెరాలు.. దొంగతనం జరగకుండా రైతు వినూత్న ఐడియా..

Published : Aug 08, 2023, 12:13 PM IST

ఓ టమాటా  రైతు తన పొలంలో దొంగతనం జరగకుండా కాపాడుకునేందుకు పొలంలో సీసీ కెమెరాలు అమర్చాడు. ఇదిప్పుడు వైరల్ అవుతుంది. 

PREV
18
 వార్నీ.. టమాటా పొలంలో సీసీ కెమెరాలు.. దొంగతనం జరగకుండా రైతు వినూత్న ఐడియా..

మహారాష్ట్ర : దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరుగుతున్న దృష్ట్యా టమాటా రైతులు తమ పంటను కాపాడుకోవడానికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

28

ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక రైతు టమాటా పంట దొంగతనం లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనలకు గురికాకుండా ఉండాలని ఓ ప్లాన్ వేశాడు. 

38
Tomatoes

తన పొలంలో సీసీ కెమెరాలను అమర్చాడు. తద్వారా తన పంటను 24 గంటలపాటు కాపలా కాయచ్చనుకున్నాడు. టమాటా అధిక ధరల నేపథ్యంలో పొలంలో ఇలా కట్టుదిట్టమైన భద్రత ఉంచాలని నిర్ణయం తీసుకున్నాడు.

48

శరద్ రావతే అనే రైతు తన పొలంలో కెమెరాల ఏర్పాటుకు రూ.22 వేలు వెచ్చించామని, అయితే ఇది ఇప్పటి అవసరం మాత్రమే అని అతను తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో టమాట ధర సుమారు రూ.160గా ఉంది.

58

టొమాటాలు లేకపోతే ఏ ఇంట్లోనూ పూట గడవదు. ప్రతీ ఆహారంలో ముఖ్యమైన పదార్ధంగా పరిగణించబడతుంది. టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రభుత్వం రాయితీ ధరలకు అందించింది. అయినా, కొంతకాలం తర్వాత దాని ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 

68

టమాటా ధరల పెరగడంతో అనేక దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం, కర్ణాటకలోని కోలార్ నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌కు సుమారు రూ. 21 లక్షల విలువైన టమోటాలను తరలిస్తున్న ట్రక్కు అదృశ్యమైనట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.

78

మరో ఘటనలో జార్ఖండ్‌లోని కూరగాయల మార్కెట్‌లోని దుకాణాల్లో సుమారు 40 కిలోల టమోటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఒక నెల క్రితం రిటైల్ రేట్లలో 300 శాతం పెరుగుదల కనిపించింది, దీని తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకుని సబ్జిడీ రేట్లకు అందించింది. 

88

గత వారం కిలో ధర దాదాపు రూ.120కి తగ్గగా, మళ్లీ రూ.200 ఆపైన ధరలు పెరిగాయి. ఆగస్టు 1న సగటు ధర రూ.132.5 ఉండగా.. వారం రోజుల క్రితమే కిలో సగటు ధర రూ.120గా ఉంది.

click me!