సరిపోయారిద్దరూ... డేటింగ్ చేస్తే డబ్బులిస్తానని తల్లి ఆఫర్.. యేడాదిలో వందమంది బాయ్ ఫ్రెండ్స్ ను మార్చిన కూతురు

First Published | Aug 4, 2023, 10:09 AM IST

కన్నకూతురిని పరాయిపురుషులతో డేటింగ్ వెళ్లమని ప్రోత్సహించిందో తల్లి. అలా వెడితే డబ్బులిస్తానని ఆఫర్ కూడా ఇచ్చింది. ఇంకేముంది ఆ కూతురు రెచ్చిపోయింది. 

బ్రిటన్ : అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ కుటుంబ పరువు మొత్తం అమ్మాయిలే మోస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తుంటారు. వారు ఏ చిన్న తప్పిదం చేసినా తమ పరువు పోతుందంటూ గగ్గోలు పెడతారు. ఇక కూతురు తప్పిదారి ప్రేమలో పడిందంటే వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.

వేరే కులం వ్యక్తితో ప్రేమలో పడితే పరువు హత్యలకు కూడా వెనకాడరు.  ఇది మన దేశంలో పరిస్థితి. విదేశాల్లో కూడా ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితిలే ఉంటుంటాయి. కాకపోతే అక్కడ డేటింగ్ కల్చర్ సాధారణ విషయం. పెళ్లికి ముందే ఒకరికొకరు తెలుసుకున్న తర్వాతే వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటారు.  


దీనికోసం టీనేజీలోనే డేటింగ్ కు వెడుతుంటారు. అయితే ఇదంతా తల్లిదండ్రులకు తెలిసి కొంత.. తెలియక కొంత జరిగిపోతూనే ఉంటుంది.  కానీ ఓ తల్లి మాత్రం కూతురికి డేటింగ్ కి వెళితే బహుమతి ఇస్తానంటూ ప్రోత్సహించింది. దీంతో ఆ కూతురు రెచ్చిపోయి.. ఏకంగా ఏడాదిలో 100 మందితో డేటింగ్ కు వెళ్ళింది.  

అది పూర్తయిన తర్వాత ఆ తల్లి ముందుగా చెప్పిన ప్రకారం 500 డాలర్లను బహుమతిగా ఇచ్చింది. కేక్ కట్ చేసి మరి తన కూతురు వందమందితో డేటింగ్ చేసింది అంటూ సంబరాలు చేసింది. ఈ విచిత్ర ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. 

ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి స్వయంగా డబ్బులు ఇచ్చి మరీ కూతురిని డేటింగ్ కు పంపించిన ఈ షాకింగ్ ఘటనకు నెటిజన్లు విచిత్రంగా రియాక్ట్ అవుతున్నారు. తల్లి ఇచ్చిన ఆఫర్ ను ఆసరాగా చేసుకుని ఆ అమ్మాయి తన అందంతో వందమంది అబ్బాయిలకు గాలం వేసింది.  

ఒక్క ఏడాదిలోనే 100 మంది బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేసింది. ఈ విషయాన్ని ఆమె సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్ టాక్ లో షేర్ చేసింది.  ఇంకేముంది వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంగా మారిపోయింది. వంద మందితో డేటింగ్ చేసి తన కూతురు తాను ఇచ్చిన ఆఫర్ను గెలుచుకుందని సంతోషంతో ఆ తల్లి.. సంబరాలు చేసింది. కేకు మీద  100 నెంబర్ క్యాండిల్ పెట్టి  ఘనంగా సెలబ్రేట్ చేసింది.

ముందుగా చెప్పినట్టే కూతురికి 500 డాలర్లను బహుమతిగా ఇచ్చింది. ఇలా కూతురిని  తల్లి స్వయంగా డేటింగ్ కి పంపించడమేంటంటూ నెటిజన్లు మండిపడుతుంటే.. ఆ తల్లి మాత్రం కూల్ గా సమాధానమిస్తోంది. పెళ్లి తర్వాత తన కూతురికి మగవాళ్ళ పట్ల భయం, అనుమానం ఉండకూడదు అని.. అందుకే చాలామంది పురుషులతో డేటింగుకు వెళ్ళమని ప్రోత్సహించినట్లుగా చెప్పింది. దీంతో నెటిజన్లకు మైండ్ బ్లాక్ అయింది. 

Latest Videos

click me!