‘ఆయనకు ఇద్దరు’.. భర్తను చెరో మూడు రోజులు పంచుకున్న భార్యలు.. మరి ఆదివారం?

First Published | Jan 22, 2020, 3:00 PM IST

పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. రాజేష్ మొదటి భార్యతో ఉండటం మొదలుపెట్టాడు. దీంతో ఈసారి రెండో భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. తన భార్య ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తన ఇంటికి రాలేదు అని పోలీసుల ముందు వాపోయింది. మరోసారి పోలీసులు నచ్చచెప్పి పంపించారు. 
 

శోభన్ బాబు హీరోగా నటించిన ‘ఏమండీ ఆవిడొచ్చింది’ సినిమా మీరందరూ చూసే ఉంటారు. అందులో హీరోకి ఇద్దరు భార్యలు. తల్లి కోసం ఒకరిని.. తండ్రి కోసం మరొకిరి మెడలో తాళి కడతాడు. ఇద్దరితో ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు మూడు రోజులు మొదటి భార్యతో... మరో మూడు రోజులు ఇంకో భార్యతో గడిపేస్తాడు. మిగిలిన ఆదివారం తల్లిదండ్రులతో కడిపేస్తాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి కలెక్షన్లు రాబట్టింది.
అచ్చం ఇలాంటి సంఘటనే ఝార్ఖండ్ రాష్ట్రం రాంచిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... రాంచీకి చెందిన రాజేష్ అనే వ్యక్తి ఒకరికి తెలీకుండా మరోకరిని రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కొద్దిరోజులపాటు బాగానే మేనేజ్ చేశాడు. కానీ తర్వాత... అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఇద్దరు భార్యలకు తెలిసిపోయింది.

పాపం భర్త మోసం చేశాడని తెలిసినా ఆ ఇద్దరు భార్యలు కాంప్రమైజ్ అయ్యారు తప్ప ఎలాంటి గొడవ చేయలేదు. అయితే... రాజేష్ మాత్రం ఓ భార్యను అసలు పట్టించుకోకుండా రెండో భార్యతోనే ఎక్కువ సేపు గడపడం మొదలుపెట్టాడు. అది మొదటి భార్యకు ఏమాత్రం నచ్చలేదు. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు కుటుంబ వ్యవహారం కదా.. అని మొదటి భార్యతో కూడా ఉండాలి అని నచ్చచెప్పి పంపించారు.
పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. రాజేష్ మొదటి భార్యతో ఉండటం మొదలుపెట్టాడు. దీంతో ఈసారి రెండో భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. తన భార్య ఐదు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తన ఇంటికి రాలేదు అని పోలీసుల ముందు వాపోయింది. మరోసారి పోలీసులు నచ్చచెప్పి పంపించారు.
ఇద్దరి మధ్యలో రాజేష్ నలిగిపోవడం మొదలైంది. దీంతో ఈసారి పోలీసులు ఇద్దరు భార్యలను పిలిచి ఓ మంచి డీల్ మాట్లాడారు. మొదటి మూడు రోజులు మొదటి భార్య దగ్గర.. తర్వాతి మూడు రోజులు రెండో భార్య దగ్గర ఉండేలా ఇద్దరితో మాట్లాడి పోలీసులు ఒప్పించారు.
ఇక మిగిలిన ఆదివారం మాత్రం అతనికి ఇద్దరు భార్యల నుంచి విముక్తి కల్పించారు. అంటే.. ఆరోజు అతనికి వీకాఫ్. తనకు నచ్చిన దగ్గర ఉండొచ్చని పోలీసులు తీర్పు ఇచ్చి పంపించేశారు. కాగా... ప్రస్తుతం ఈ ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.

Latest Videos

click me!