Honeymoon trip: అందమైన లోయల్లో హనీమూన్‌.. డెస్టినేషన్‌ అదిరింది.. ఇండియాలో ఎక్కడంటే!

Published : Apr 19, 2025, 12:05 PM IST

Honeymoon in the Beautiful Valleys:  దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమైంది. ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. అయినా శుభకార్యల వేళ.. వేడుకలు చేసుకోక తప్పదు. ఇక పెళ్లి తర్వాత హనిమూన్‌ మాత్రం.. ఈ వేసవిలో చల్లని ప్రాంతానికి వెళ్లడం సరైన ఎంపిక. అందులోనూ అందమైన లోయలో హనిమూన్‌ చేసుకోవడం... ఐడియా అదిరింది కదూ.. మరి ఇండియాలో ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసా..?  

PREV
16
Honeymoon trip: అందమైన లోయల్లో హనీమూన్‌.. డెస్టినేషన్‌ అదిరింది.. ఇండియాలో ఎక్కడంటే!
Spiti Valley

మన దేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యాటకానికి పెట్టింది పేరు. ప్రస్తుతం అనేక మంది నూతన దంపతులు తమ హనీమూన్‌ డెస్టినేషన్‌కు అక్కడికే వెళ్లాలని అనుకుంటున్నారంట. హిమాచల్‌లోని అందమైన లోయలలో హనీమూన్ ప్లాన్ చేసుకుని.. ఆ అనుభూతిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారట అనేకమంది. 

26
Malana, Himachal Pradesh

ఎలాంటి ప్రాంతాలకు వెళ్లొచ్చంటే.. 
వేసవిలో హనీమూన్ ప్లాన్ చేస్తుంటే మాత్రం.. హిమాచల్ ప్రదేశ్‌ ఎంపిక చేసుకోవడం ఉత్తమం.. అక్కడ ఈ వేసవి కాలంలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నప్పుడు.. మన మనసులోకి వచ్చే మొదటి విషయం అక్కడి చల్లని ప్రాంతాలు, మంచుపర్వాతాలు, చల్లని గాలుల నడుమ సేదదీరేందుకు, డ్యాయట్లు పాడేందుకు కపుల్స్‌కి నచ్చే, మెచ్చే ప్రాంతం. ఈ వేసవిలో పెళ్లి తర్వాత మీ జ్ఞాపకాలలో చిరస్మరణీయంగా చేసే ప్రాంతం... హిమాచల్‌లోని హనీమూన్ గమ్యస్థానాలు. 

36

మనాలి అత్యుత్తమమైనది...
మీరు మనాలికి వెళ్తే ఆ ప్రదేశం హనీమూన్‌కు ఉత్తమమైనది. ఎందుకంటే.. ఒకవైపు మంచుతో కప్పబడిన పర్వతాలు, నిత్యం ప్రవహించే బియాస్ నది, అందమైన లోయలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. దీంతోపాటు సోలాంగ్ వ్యాలీ, రోహ్తాంగ్ పాస్, హిడింబా టెంపుల్, మాల్ రోడ్‌లలో కలిసి తిరగడం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతులను పంచుతుంది. 

46

సిమ్లాకు ప్లాన్ చేసుకుంటే.. 
మీరు క్లాసిక్ అదేవిధంగా పచ్చని పర్యాటక ప్రాంతానికి వెళ్లాలంటే.. సిమ్లా సరైన ఎంపిక. ఇక్కడ కూడా హనీమూన్ ప్లాన్ చేసుకోవచ్చు. టాయ్ ట్రైన్ రైడ్ నుంచి రిడ్జ్, మాల్ రోడ్, అందమైన కుఫ్రి కొండల వరకు, సిమ్లాలోని ప్రతి మూల శృంగారభరితంగా ఉంటుంది, ఇది మీ హనీమూన్‌కు మంచి ఎంపిక అవుతుంది. 

56

ధర్మశాల అత్యుత్తమమైనది..


మీరు హనీమూన్ కోసం ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ధర్మశాలకు వెళ్లవచ్చు. టిబెటన్ సంస్కృతి, అక్కడి పర్వతాలను దగ్గరి నుంచి చూడవచ్చు. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతిని ఇష్టపడే ప్రేమికులు ఈ ప్రాంతానికి వెళ్లవచ్చు. 

 

66

కసోల్ ప్రాంతం కూడా... 
కసోన్‌ అనే ప్రాంతంలో అందమైన లోయలు ఆహ్లాదనాన్ని పంచుతాయి. ఇక్కడి అందమైన కేఫ్‌లు, నది వెంబడి సుదీర్ఘంగా నడుచుకుంటూ వెళ్లవచ్చు... దీని సమీపంలోని తోష్ గ్రామం మీకు అందమైన దృశ్యాలతో కనువిందు చేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories