ఈ దేశాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అవసరం: ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), బ్రెజిల్, రష్యాలో బండి నడపడానికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి.
ఐడిపి అంటే ఏమిటి? దీన్ని ఎలా పొందాలి? ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడిపి) భారతదేశంలో ఆర్టీఓ (రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్) ద్వారా జారీ చేయబడుతుంది. ఇది 150 దేశాల్లో చెల్లుతుంది. ఐడిపి పొందడానికి మీ దగ్గర వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, వీసా, లేటెస్ట్ ఫోటో, అప్లికేషన్ ఫార్మ్ ఉండాలి, అలాగే ఫీజు కూడా కట్టాలి.