Mysterious Railway Stations: ఆంధ్రప్రదేశ్ లో దెయ్యాలు తిరిగే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?

Published : Feb 16, 2025, 07:40 PM IST

Mysterious Railway Stations: మీకు తెలుసా? ఇండియాలో కొన్ని రైల్వే స్టేషన్లలో దెయ్యాలు తిరుగుతాయట. అలాంటి స్టేషన్లలో ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్న రైల్వే స్టేషన్ల గురించి, ఏపీలోని ఆ స్టేషన్ గురించి తెలుసుకుందాం రండి.   

PREV
14
Mysterious Railway Stations: ఆంధ్రప్రదేశ్ లో దెయ్యాలు తిరిగే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?

ఇండియా రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైలు వ్యవస్థల్లో నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజూ 19 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు 24 గంటలూ బిజీగా ఉంటాయి. కొన్ని మారుమూల స్టేషన్లకు సంబంధించి కొన్ని భయానక కథలు ప్రచారంలో ఉన్నాయి. దెయ్యాలు ఆ స్టేషన్లలో తిరుగుతున్నాయని స్థానికులు చెబుతుంటారు. అవేమిటో చూద్దాం. 

24

లూథియానా రైల్వే స్టేషన్ 

పంజాబ్‌లోని లూథియానా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై ఒక మహిళ దారుణంగా మరణించింది. ఆమె ఆత్మ ఆ స్టేషన్ లో తిరుగుతుందనే ప్రచారం ఉంది. ఈ స్టేషన్‌లో భయంకరమైన అరుపులు విన్నామని, ఎవరో తిరుగుతున్న దృశ్యాలు చూశామని స్థానికులు చెబుతుంటారు. 

బరోగ్ రైల్వే స్టేషన్

హిమాచల్ ప్రదేశ్‌లోని బరోగ్ రైల్వే స్టేషన్ అందమైన కొండల మధ్య ఉంటుంది. ఈ స్టేషన్ పై విచిత్రమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణ ఇంజనీర్ కల్నల్ బరోగ్ దాని నిర్మాణ సమయంలో ఆత్మహత్య చేసుకున్నారట. అప్పటి నుంచి అక్కడ ఉన్న సొరంగం మార్గంలో ఆయన ఆకారం తిరుగుతుందని స్థానికులు చెబుతారు. 

 

34

బెగున్‌కోడర్ రైల్వే స్టేషన్

పశ్చిమ బెంగాల్‌లోని అడవుల్లో ఉండే బెగున్‌కోడర్ స్టేషన్ దెయ్యం కథలకు ప్రసిద్ధి చెందింది. తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ ఈ రైల్వే స్టేషన్‌లో తిరుగుతుందట. రాత్రి పూట ట్రాక్‌పై కూడా నడుస్తుందని స్థానికులు చెబుతుంటారు. ఇది తెలిసి కొందరు రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేయడానికి నిరాకరించారట. దీంతో గతంతో ఈ రైల్వే స్టేషన్ మూతపడింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తెరుచుకుంది. అయితే ఆ తెల్ల చీర స్త్రీ కథలు మాత్రం ఆగలేదు.

ఇది కూడా చదవండి ఆహా ఏమి రుచి.. ఈ రైల్వే స్టేషన్లలో ఇవి తింటే మీరు ఇలాగే అంటారు

44

నైనీ రైల్వే స్టేషన్

ఉత్తరప్రదేశ్‌లోని నైనీ రైల్వే స్టేషన్ లో కూడా దెయ్యం తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లపై దెయ్యం ఆకారాన్ని చూశామని స్థానికులు చెబుతారు. గంగా నదికి సమీపంలో ఉన్న ఈ స్టేషన్ కు రావడానికి కూడా ప్రయాణికులు భయపడతారు. 

చిత్తూరు రైల్వే స్టేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు రైల్వే స్టేషన్‌పై కూడా పలు దెయ్యం కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ట్రాక్‌పై ఒక మహిళను చంపారని, ఆమె ఆత్మ అక్కడ తిరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు కూడా తరచుగా రాత్రిపూట మహిళ అరుపులు వింటుంటామని  చెబుతారు.

2013లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ పై కొందరు దాడి చేసి చంపేశారు. అప్పటి నుంచి ఆయన ఆత్మ ఆ స్టేషన్ సమీపంలో సంచరిస్తుందని స్థానికులు నమ్ముతారు. 

గమనిక: ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ప్రచారం ఉన్న కథనాలు మాత్రమే. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. 

 

Read more Photos on
click me!

Recommended Stories