IRCTC Goa Tour: తక్కువ ఖర్చులో గోవా టూర్ కి వెళ్లాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్!

Published : Feb 16, 2025, 03:48 PM IST

గోవా టూర్ కి వెళ్లాలని, అక్కడ బాగా ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బులు అడ్జెస్ట్ గాకనో, పరిస్థితులు సహకరించకనో వెనకడుగు వేస్తారు. అయితే తక్కువ ఖర్చులో గోవా ట్రిప్ ఎంజాయ్ చేసేలా IRCTC కొత్త ప్యాకేజి తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ప్యాకేజీ ఏంటీ దాని విశేషాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
IRCTC Goa Tour: తక్కువ ఖర్చులో గోవా టూర్ కి వెళ్లాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్!

తక్కువ బడ్జెట్ లో గోవా టూర్ వెళ్లాలి అనుకునేవారికి IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.30 వేల లోపే ఉంది. ఈ టూర్ 4 రోజులపాటు ఉంటుంది. ఈ టూర్ లో గోవాలోని అందమైన ప్రదేశాలను పర్యాటకులు చుట్టి రావచ్చు.

24
టూర్ ప్యాకేజీ

ఐఆర్‌సిటిసి గోవా టూర్ ప్యాకేజీ పర్యాటకులకు సౌకర్యవంతమైన, మరపురాని అనుభూతిని అందిస్తుంది. ఇందులో వసతి, విహారయాత్రలు, భోజనం ఉంటాయి. గోవా టూర్ లో ఓల్డ్ గోవా చర్చ్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్‌రైట్ గ్యాలరీ, శ్రీ మంగేశీ ఆలయం, మిరామర్ బీచ్, మండోవి నది తదితర అందమైన ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

34
గోవా టూర్ కి జంటగా..

గోవా టూర్ 4 రోజులపాటు ఉంటుంది. ఈ టూర్ కి ఒంటరిగా, జంటగా లేదా కుటుంబంతో కూడా వెళ్లవచ్చు. ఈ ప్యాకేజీ అందరికీ సరిపోతుంది. అయితే సింగిల్, డబుల్, త్రిపుల్ ఆక్యూపెన్సీలకు ఒక్కో రకంగా ధరలు ఉంటాయి. 

44
టూర్ ఖర్చు

IRCTC ప్రవేశ పెట్టిన ఈ టూర్ ప్యాకేజీ ధర రూ. 28,600. ఇందులోనే వసతి, భోజనం, గైడెడ్ టూర్‌లు ఉంటాయి. గోవాలోని బీచ్‌లు, కోటలు అందమైన ప్రదేశాలు చూడవచ్చు. ప్యాకేజీ పూర్తి వివరాలకు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ చూడండి.

click me!

Recommended Stories