ఇంట్లో చిరిగిన, పాడై పోయిన పాత‌ ఫొటో ఉందా? Chat GPTతో కొత్త‌గా మార్చుకోవ‌చ్చు..

Published : May 22, 2025, 05:28 PM IST

ఆర్టిఫిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ వ‌స్తున్న మార్పులు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైంది చాట్ జీపీటీ. ఈ ఏఐ టూల్‌లో ఉన్న ఒక బెస్ట్ ఫీచ‌ర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
అన్నింటికీ చాట్ జీపీటీనే

మొన్న‌టి వ‌ర‌కు ఏ చిన్న‌ సందేహం వ‌చ్చినా వెంట‌నే గూగుల్ ఓపెన్ చేసి తెలుసుకునే వారు. కానీ ఎప్పుడైతే చాట్ జీపీటీ అందుబాటులోకి వ‌చ్చిందో యూజ‌ర్లు తెగ ఉప‌యోగించేస్తున్నారు. గూగుల్‌లో ఒక ప్ర‌శ్నను సంధిస్తే ప‌దుల సంఖ్య‌లో స‌మాధానాలు వ‌స్తాయి. కానీ చాట్ జీపీటీలో మాత్రం మీరు అడిగిన ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం ఇస్తుంది.

25
కేవ‌లం స‌మాచారం మాత్ర‌మే కాదు

చాట్ జీపీటీలో కేవ‌లం స‌మాధానం మాత్ర‌మే కాకుండా ఫొటోలు కూడా రూపొందించుకోవ‌చ్చు. మీ ఊహ‌కు దృశ్య రూపాన్ని అందించ‌డంలో చాట్ జీపీటీ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక స‌న్నివేశాన్ని ఊహించుకొని మీరు దానిని చాట్ జీపీటీకి ప్రాంప్ట్ రూపంలో అందిస్తే అది ఫొటో రూపంలోకి మార్చి ఇస్తుంది. అయితే ఇందుకోసం మీరు చాట్ జీపీటీకి స‌రైన ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.

35
పాత ఫొటోను కొత్తగా మార్చేయడం.

ఒక‌ప్పుడు ఫొటోల‌ను రీల్స్ ద్వారా రూపొందించే వారు. ఇది ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు ఆశ్చ‌ర్యంగా ఉండొచ్చు. మ‌నలో చాలా మంది ఇంట్లో ఇప్ప‌టికీ పాత ఫొటోలు ఉంటాయి. అయితే అవి చిరిగిపోయి, లేదా నీటిలో త‌డిచి పాడైపోయే స్థితిలో ఉంటాయి. అయితే చాట్ జీపీటీని ఉప‌యోగించి పాత ఫొటోల‌ను కొత్త‌గా మార్చుకోవ‌చ్చు.

45
ఏం చేయాలంటే

ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో పాత ఫొటోను క్యాప్చ‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత చాట్ జీపీటీని ఓపెన్ చేసి స‌ద‌రు ఫొటోను అప్‌లోడ్ చేయాలి. అనంత‌రం Fix this image, repair damaged parts అనే క‌మాండ్‌ను ఇవ్వాలి. వెంట‌నే కొత్త ఫొటోను చాట్ జీపీటీ అందిస్తుంది.

55
బ్లాక్ అండ్ వైట్ ఫొటోను క‌ల‌ర్ ఫొటోగా

ఇక ఇప్ప‌టీకీ మ‌నలో చాలా మంది ద‌గ్గ‌రా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉంటాయి. వాటిని చాట్ జీపీటీ స‌హాయంతో క‌ల‌ర్ ఫొటోలుగా మార్చేయ‌వ‌చ్చు. ఇందుకోసం ముందుగా ఆ ఫొటోను మీ ఫోన్ కెమెరాతో క్యాప్షర్ చేయాలి. 

ఆ త‌ర్వాత చాట్ జీపీటీలోకి ఆ ఫొటోను యాడ్ చేసి.. Convert this black and photo into colour photo అనే ప్రాంప్ట్‌ను ఇవ్వాలి. వెంట‌నే క‌ల‌ర్ ఫొటో వ‌చ్చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories