వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీకి కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. ఇందుకు సంబంధించి వైఎస్ షర్మిలకు, కాంగ్రెస్ అధిష్టానంల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 18వ తేదీన కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా తన భర్త అనిల్‌కుమార్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన షర్మిల.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం, రాజకీయ పరిణామాలు, విలీనంపై పెట్టిన షరతులపై చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది.