హైదరాబాద్ లో ఫ్యామిలీ సెలూన్ లో క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచారం..

First Published | Aug 11, 2023, 1:27 PM IST

క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్యామిలీ సెలూన్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. కేసులు నమోదు చేశారు. 

హైదరాబాద్ : పోలీసులు ఎన్ని దాడులు చేసినా.. ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా వ్యభిచార దందా ఆగడం లేదు.  రోజు ఏదో ఒకచోట ఈ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. 

తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.


సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్ అనే పేరు గల సెలూన్  బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉంది. ఈ సెలెన్లో మసాజ్ పేరుతో  వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది.

ఆ సమాచారం ప్రకారం బంజారాహిల్స్ పోలీసులు సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్ పై దాడులు చేశారు. ఈ ఫ్యామిలీ సెలూన్ ను ప్రకాష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. 

అతను  వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి..ఈ సెలూన్ లో క్రాస్ మసాజ్ చేపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలా పదిమంది యువతులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఈ సెలూన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా తేలింది. 

ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు యజమానిపై కేసు నమోదు చేశారు. సీక్రెట్ ఆఫ్ హెయిర్ అండ్ ఫ్యామిలీ సెలూన్ ను సీజ్ చేశారు. 

Latest Videos

click me!